స్వచ్ఛమైన నీటికి సోడా! | Soda for pure water! | Sakshi
Sakshi News home page

స్వచ్ఛమైన నీటికి సోడా!

Nov 13 2017 12:55 AM | Updated on Nov 13 2017 12:55 AM

Soda for pure water! - Sakshi

శుద్ధమైన నీరుంటే చాలు.. బోలెడన్ని రోగాలు.. వాటి ద్వారా వచ్చే ఇబ్బందులను తప్పించుకోవచ్చు. అయితే మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ వాటర్‌ ఫిల్టర్‌ను తీసుకున్నా తరచూ కాండిళ్లు లేదంటే ఫిల్టర్లు మార్చడం తప్పనిసరి. దీంతోపాటే ఆధునిక రివర్స్‌ ఆస్మాసిస్‌ ఫిల్టర్లకు విద్యుత్తూ ఖర్చు అవుతుంది.

ఈ ఇబ్బందులన్నింటినీ తొలగించేందుకు ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ సరికొత్త సోడా స్ట్రీమ్‌ టెక్నిక్‌ను అభివృద్ధి చేశారు. పాతకాలపు గోలిసోడాలు తెలసుగా.. వాటిల్లో వాడే కార్బన్‌ డైయాక్సైడ్‌నే అత్యధిక పీడనంతో చిన్న చిన్న బాటిళ్లలో నింపడం.. రెండుగా విడగొట్టిన సిలికాన్‌ గొట్టం గుండా శుద్ధి చేయాల్సిన నీటిని పంపడం.. అంతే మనం చేయాల్సిన పని. సిలికోన్‌ గుండా ప్రసారం కాగల కార్బన్‌డైయాక్సైడ్‌ కారణంగా నీటి తాలూకూ రసాయన మిశ్రమం మారిపోతుంది.

ఈ క్రమంలో ధనాత్మక ఆవేశం కలిగిన హైడ్రోజన్‌ నీటిలో వేగంగా ప్రయాణిస్తే.. బైకార్బనేట్‌ (కార్బన్‌డైయాక్సైడ్‌ విడిపోడం వల్ల ఏర్పడే మూలకాలు) నెమ్మదిగా వెళుతూ చుట్టూ ఉన్న మలినాలను ఆకర్షించి నీటిని శుద్ధి చేస్తుంది. ఇంకో విషయం కార్బన్‌డైయాక్సైడ్‌ను పదే పదే వాడుకునే అవకాశముండటం వల్ల  దీనికయ్యే ఖర్చు కూడా అతితక్కువన్నమాట. అంతేకాదు. ఈ టెక్నాలజీతో బావులు, చెరువులు, నదుల్లోని నీటిలోంచి కూడా బ్యాక్టీరియా, ధూళి కణాలను తొలగించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement