అలా జరగకూడదని... | salman, katrina on commercial advertisement | Sakshi
Sakshi News home page

అలా జరగకూడదని...

Jun 14 2015 11:40 PM | Updated on Aug 13 2018 4:19 PM

అలా జరగకూడదని... - Sakshi

అలా జరగకూడదని...

సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్‌లు మరోసారి కలిసి నటించనున్నారా? సినిమాలో కాదు లెండి... ఒక కమర్షియల్ యాడ్‌లో!...

సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్‌లు మరోసారి కలిసి నటించనున్నారా? సినిమాలో కాదు లెండి... ఒక కమర్షియల్ యాడ్‌లో! సల్మాన్‌తో కలిసి యాడ్ చేసే అవకాశం వచ్చినందుకు కత్రినా ఎగిరి గంతేసినంత పని చేసింది. ఏమైందో ఏమోగానీ చివరి నిమిషంలో సల్మాన్ ఖాన్ మనసు మార్చుకున్నాడట.

‘‘ఆమెతో  కలిసి నటించేది లేదు’’ అని సల్మాన్ తేల్చిచెప్పడంతో కత్రినా కన్నీరు మున్నీరైనంత పని చేసిందట.
ఎందువల్ల సల్మాన్ తన మాజీ ప్రియురాలితో కలిసి యాడ్ చేయనన్నాడు? వారి మధ్య తాజాగా విభేదాలేమైనా వచ్చాయా? అదేమీ కాదు...ఇప్పటికీ వారి మధ్య  ఆత్మీయత బలంగానే ఉంది. సల్మాన్ ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఇప్పటికీ కత్రినా వెళుతూనే ఉంది.

‘సేఫ్ డిస్టెన్స్’ పాటించడానికే కత్రినాతో కలిసి సల్మాన్ యాడ్ చేయడం లేదట. ఈ యాడ్ పుణ్యమా అని రకరకాల గాసిప్‌లు పుట్టవచ్చునని, రణ్‌బీర్‌కపూర్, కత్రినాల మధ్య దూరం పెరగవచ్చుననే ముందస్తు జాగ్రత్తతో సల్మాన్ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు  ఆ నోటా ఈ నోటా వినిపిస్తోంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement