మీదే రాజ్యం

Sakshi Sahitya Maramaralu

సాహిత్య మరమరాలు

ఆంధ్ర విశ్వవిద్యాలయ సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతున్నాయి. దానికి ఏర్పాట్లు చేస్తున్న విద్యార్థుల సంఘం వాళ్లు నలువైపులా తూర్పు చాళుక్యుల తోరణం, కృష్ణదేవరాయల ద్వారం అంటూ ఏర్పాటు చేశారు. ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి ఏర్పాట్లను పరిశీలిస్తూ వస్తున్నారు. అన్ని తోరణాలు చూశాక విద్యార్థి సంఘపు కార్యదర్శితో– అందరు రాజుల పేర్లతో ద్వారాలు పెట్టారు, మరి రెడ్డిరాజుల పేర్లు ఒక్కటికూడా పెట్టలేదేంటి? అని అడిగారు.ఈ ప్రశ్నకు ముందు ఆశ్చర్యపోయిన ఆ కార్యదర్శి వెంటనే తేరుకుని– అవన్నీ అంతరించిపోయిన రాజరికాలు, రెడ్ల ప్రభుత్వం ఇంకా కొనసాగుతోంది కదా? అని సమాధానమిచ్చాడు. కుర్రాడి చమత్కారానికి భేష్‌ అని మెచ్చుకుని భుజం తట్టి వెళ్లిపోయారు కట్టమంచి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top