పదిహేనేళ్లకే పడ్డాడు | prabhas crush Raveena Tandon | Sakshi
Sakshi News home page

పదిహేనేళ్లకే పడ్డాడు

Dec 10 2017 12:21 AM | Updated on Dec 10 2017 12:37 AM

prabhas crush Raveena Tandon - Sakshi

‘అందాజ్‌ అప్నా అప్పా’ 1994 మూవీ. అప్పుడు ప్రభాస్‌ ఏజ్‌ పదిహేనేళ్లు. ఆ సినిమాలోని ‘ఎల్లోజీ సనమ్‌ హమ్‌ ఆగయే’ అనే పాటను ప్రభాస్‌ చాలా ఏళ్లపాటు పాడుకుంటూ తిరిగాడు. ఇప్పటికీ ఆ పాట వస్తుంటే.. అటువైపు తలతిప్పి చూస్తాడు. ప్రభాస్‌ టీనేజ్‌ క్రష్‌ సాంగ్‌ అది!  ఇరవై మూడేళ్లుగా అతడిని హంట్‌ చేస్తోంది.

ఇంతకీ ప్రభాస్‌ క్రష్‌ ఎవరంటే ఆ సినిమాలోని రవీనా టాండన్‌! పాట ఆమిర్‌ ఖాన్, రవీనాల మీద ఉంటుంది. ఆ పాట తర్వాత రవీనా.. ప్రభాస్‌ మనసులో ఉండిపోయింది. ‘మీ ఫస్ట్‌ క్రష్‌ ఎవరు మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌?’ అని అడిగితే ప్రభాస్‌ వెంటనే ‘ఎల్లోజీ సనమ్‌ హమ్‌ ఆగయే’ అని హమ్‌ చేస్తాడు..  చిరునవ్వులు చిందిస్తూ! రాణా ఓసారి ముంబై వెళ్లినప్పుడు ‘మా ప్రభాస్‌.. మీ డైహార్డ్‌ ఫ్యాన్‌’ అని చెప్తే రవీనాతో పాటు, ఆమె భర్త అనిల్‌ తందానీ కూడా హ్యాపీగా ఫీల్‌ అయ్యారట.

‘బాహుబలి’ కింగ్‌డమ్‌తో స్టార్‌డమ్‌ తెచ్చుకున్న ప్రభాస్‌కు ఇప్పుడు లెక్కలేనంత మంది ఫ్యాన్స్‌. ప్రభాస్‌కి మాత్రం ఇప్పటికీ ఒకే ఒక్క ఫ్యాన్‌ రవీనా. అంతే కాదు, ముంబై ఎప్పుడు వెళ్లినా ప్రభాస్‌ టీమ్‌ తప్పకుండా రవీనా ఫ్యామిలీని కలిసి వస్తుంది. ప్రస్తుతం ప్రభాస్‌ ‘సాహో’ షూటింగ్‌లో, క్లైమాక్స్‌ సీన్స్‌లో బిజీగా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement