శుభాశుభ ఫలాలకు కర్మలే కర్తలు | pothana poem meaning special | Sakshi
Sakshi News home page

శుభాశుభ ఫలాలకు కర్మలే కర్తలు

Mar 13 2016 12:34 AM | Updated on Sep 3 2017 7:35 PM

శుభాశుభ ఫలాలకు కర్మలే కర్తలు

శుభాశుభ ఫలాలకు కర్మలే కర్తలు

వ్యాఖ్యాన భావం... ప్రతి జీవుడికి తన పుణ్య కర్మల వల్ల మేలు, పాప కర్మల వల్ల కీడు సంభవిస్తుంది.

శ్లోకనీతి  పద్యం-6

కర్మములు మేలునిచ్చును కర్మంబులు కీడునిచ్చు కర్తలు తనకుం
కర్మములు బ్రహ్మకైనను కర్మగుడై పరుల దడవగా నేమిటికిన్
కావున బరులకు హింసలు, గావింపగ వలదు తనకు కల్యాణముగా
భావించి పరుల నొంచిన బోవునె తత్ఫలము పిదప బొందక యున్నే

వ్యాఖ్యాన భావం... ప్రతి జీవుడికి తన పుణ్య కర్మల వల్ల మేలు, పాప కర్మల వల్ల కీడు సంభవిస్తుంది. సృష్టికర్త దృష్టిలో శుభాశుభ ఫలాలకు కర్మలే కర్తలు. కనుక కర్మానుసారంగా ప్రాప్తించే సుఖదుఃఖాలకు ఇతరులు కారకులని భావించకూడదు. అంతేకాదు ఆ కారణంగా ఇతరులను హింసించటం ఏ మాత్రం తగదు. తనకు మేలు కలుగుతుందని భావించి ఎవరైనా సరే ఇతరులను హింసిస్తే, వారు ఆ పాప కర్మ ఫలాలను అనుభవించక తప్పదు.  తెలిసి చేసినా తెలియచేసినా తప్పు తప్పే. శిక్ష తప్పదు. అందుకే కర్మలు ఆచరించేటప్పుడు అందులోని మంచిచెడులను సమీక్షించుకోవాలి. తెలియకపోతే పెద్దలను అడిగి తెలుసుకోవాలి. సాధ్యమైనంతవరకు సత్కర్మలను అచరించడానికే ప్రయత్నించాలి. అప్పుడు సత్కర్మ ఫలితాలను అనుభవించవచ్చు.... అని వసుదేవుడు కంసునితో అంటున్నాడు.  - డా. పురాణపండ వైజయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement