గుట్ట పూసలు

 News gold design - Sakshi

ఆభరణం

గుట్టపూసలు అంటే ముత్యాలు. అయితే, మనకు తెలిసినవి గుండ్రని ఆకారంలో ఉండే ముత్యాలు. గుట్టపూసలు అనబడే ఈ ముత్యాలు అన్నీ ఒకే ఆకారంలో ఉండవు. పైగా చిన్న చిన్న పూసలుగా ఉంటాయి. బామ్మలకాలంలో ఇవి బాగా ఫేమస్‌.  సంప్రదాయ దుస్తుల మీదకు బాగా నప్పుతాయి. మరుగునపడిన ఈ స్టైల్‌ మళ్లీ వెలుగులోకి వచ్చింది. వివాహ వేడుకలలో పట్టుచీరల మీదకు ఈ పూసలతో డిజైన్‌ చేసిన బంగారు ఆభరణాలను ధరిస్తే∙ఆకర్షణీయంగా కనిపిస్తారు. 

రూబీ, ఎమరాల్డ్, ఫ్లాట్‌ డైమండ్స్‌కి కూడా గుట్టపూసలతో అల్లిక ఉంటుంది.ఈ పూసలను కృత్రిమ పద్ధతులలోనూ తయారుచేస్తున్నారు. దీని వల్ల ఖర్చు తగ్గుతుంది. ∙మెడను పట్టి ఉంచే చోకర్స్‌తో పాటు పొడవైన హారాల వరకు గుట్టపూసలతో డిజైన్‌ చేయించుకోవచ్చు. ∙పొడవాటి హారాలను నడుముకు వడ్డాణంలా కూడా వాడచ్చు. గుట్టపూసల రంగు మారకుండా ఉండాలంటే వెల్వెట్‌ క్లాత్‌లో కాకుండా ప్లాస్టిక్‌ జిప్‌లాక్‌ కవర్‌లో భద్రపరుచుకోవడం మేలు. చాలా మంది వెల్వెట్‌ క్లాత్‌ ఉన్న జువెల్రీ బాక్స్‌లలో ఆభరణాలను భద్రపరుస్తుంటారు. వీటిలో బాక్టీరియా ఫామ్‌ అయ్యి, ఆభరణం నల్లబడే అవకాశం ఉంది.
శ్వేతారెడ్డి ,ఆభరణాల నిపుణురాలు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top