శారీతో.. ప్యాంట్‌! | new look to dress | Sakshi
Sakshi News home page

శారీతో.. ప్యాంట్‌!

Dec 29 2016 11:25 PM | Updated on Sep 4 2017 11:54 PM

శారీతో.. ప్యాంట్‌!

శారీతో.. ప్యాంట్‌!

శారీస్‌తో స్కర్టులు, గౌన్లు, లెహంగాలను రూపొందించడం తెలిసిందే!

న్యూలుక్‌

శారీస్‌తో స్కర్టులు, గౌన్లు, లెహంగాలను రూపొందించడం తెలిసిందే! ఇలా ట్రౌజర్‌ ప్యాంట్‌గానూ డిజైన్‌ చేస్తే?! కుర్తా, టాప్స్‌కు కొత్త అందాలను అద్దవచ్చు. మోడ్రన్‌గా వెలిగిపోవచ్చు. దీనికోసం మందంగా ఉండే దుపట్టాలనూ ఉపయోగించవచ్చు. ∙పాత మోడల్‌ అనుకున్న జరీ, పువ్వుల ప్లింట్లు ఉన్న చీరలు లేదా దుపట్టాలను ఎంచుకోవాలి. కొలతల ప్రకారం కావల్సినంత ఫ్యాబ్రిక్‌ తీసుకొని ప్యాంట్‌గా డిజైన్‌ చేయాలి.

పూర్తి కాంట్రాస్ట్‌ పువ్వుల డిజైన్లలో ఉన్న కలర్‌ టాప్‌ ధరిస్తే స్టైలిష్‌గా కనిపిస్తారు. ఈవెనింగ్, వెస్ట్రన్‌ వేడుకలకు ఈ ప్యాంట్స్‌ బాగా నప్పుతాయి ∙పూర్తి ప్లెయిన్‌ సిల్క్‌ శారీస్‌తోనూ రూపొందించుకోవచ్చు ∙కాటన్‌ శారీ లేదా దుపట్టాలను ఇలా ట్రౌజర్‌ ప్యాంట్‌గా రూపొందించుకొని ధరిస్తే సౌకర్యంగానూ, స్టైలిష్‌గానూ ఉంటాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement