ప్రకృతి కట్టిన వంతెనలు | Nature built bridges | Sakshi
Sakshi News home page

ప్రకృతి కట్టిన వంతెనలు

Apr 17 2014 11:39 PM | Updated on Oct 20 2018 4:36 PM

ప్రకృతి కట్టిన వంతెనలు - Sakshi

ప్రకృతి కట్టిన వంతెనలు

కింద నదీ ప్రవాహం.. పైన ప్రకృతి నిర్మిత వంతెనపై విహారం.. ఏడాది పొడవునా వానలు.. ఎత్తై జలపాతాలు.. పచ్చదనం పరుచుకున్న అడవులు..

చిరపుంజి
 
కింద నదీ ప్రవాహం.. పైన ప్రకృతి నిర్మిత వంతెనపై విహారం.. ఏడాది పొడవునా వానలు.. ఎత్తై జలపాతాలు.. పచ్చదనం పరుచుకున్న అడవులు.. దట్టంగా అలముకునే పొగమంచు.. వేడి అన్నదే లేని ఈ శీతల ప్రాంతం ఉన్నది మనదేశంలో మేఘాలయ రాష్ట్రంలోని చిరపుంజి లో! ఉత్తర ఈశాన్య ప్రాంతమైన చిరపుంజిలో మావ్ లనోంగ్ గ్రామానికి వెళితే ప్రకృతి కట్టిన వంతెనలపై మీరూ అడుగులు వేయవచ్చు.

భువిపై అత్యంత చిత్తడినేలగా పేరున్న చిరపుంజిలో రబ్బరు వృక్షాల నుంచి వచ్చిన వేర్లు ఇవి. ఒకదానికొకటి అల్లుకుపోయి, నదికి ఇటు వైపు నుంచి అటువైపుకు వంతెన కట్టాయి. ఈ అద్భుతాన్ని వీక్షించడానికి, ట్రెకింగ్ చేయడానికి యువత  ఆసక్తి చూపుతుంటారు. 100 అడుగుల పొడవులో, 50 మందిని మోయగల సామర్థ్యంతో ఉన్న ఈ బ్రిడ్జ్‌లు సుమారు ఐదారు వందల ఏళ్ల క్రితం ఏర్పడి ఉంటాయని వృక్షశాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
 
 ఇలా వెళ్ళాలి:
 మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఎయిర్ పోర్ట్ ఉంది.
     
 గౌహతీకి రైలుమార్గం ఉంది. అక్కడి నుంచి చిరంపుంజికి 99 కి.మీ.
     
 గౌహతి రైల్వేస్టేషన్‌కు దగ్గరలో పల్టాన్ బజార్‌లో బస్ స్టేషన్ ఉంది. ఇక్కడ నుంచి షిల్లాంగ్‌కి, షిల్లాంగ్ నుంచి చిరపుంజికి బస్ సదుపాయాలు ఉన్నాయి.
     
 సందర్శనకు మే నెల వరకు అనుకూలం. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు ఎక్కువగా పడతాయి  వేసవి ఉష్ణోగ్రత 13 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement