ఇతడికి మిల్లీ‘వైరస్’ సోకింది..! | Millie him 'virus' infected ..! | Sakshi
Sakshi News home page

ఇతడికి మిల్లీ‘వైరస్’ సోకింది..!

Dec 17 2013 11:53 PM | Updated on Sep 2 2017 1:42 AM

ఇతడికి మిల్లీ‘వైరస్’ సోకింది..!

ఇతడికి మిల్లీ‘వైరస్’ సోకింది..!

పాపులర్ అయిన పాప్ సింగర్స్‌కు హార్డ్‌కోర్ ఫ్యాన్స్ చాలా మందే ఉంటారు. అలాంటివారిలో కొందరికి పిచ్చి తారస్థాయికి చేరి ఉంటుంది.

పాపులర్ అయిన పాప్ సింగర్స్‌కు హార్డ్‌కోర్ ఫ్యాన్స్ చాలా మందే ఉంటారు. అలాంటివారిలో కొందరికి పిచ్చి తారస్థాయికి చేరి ఉంటుంది. 40 యేళ్ల కార్ల్ మెకాయిడ్‌కు అమెరికాకు చెందిన మిల్లీసైరస్ అంటే అభిమానం. అది ఎంతంటే... ఒళ్లంతా ఆమె టాటూలు చెక్కించుకొనేంతగా! తాము అభిమానించే వ్యక్తుల పేర్లు, చిత్రాలను ఒంటిపై చెక్కించుకోవడం పాశ్చాత్యులకు మామూలే. కార్ల్ మాత్రం అంతటితో సంతృప్తి పడలేదు!

మిల్లీ సైరస్ పేరును, ఆమె బొమ్మను, ఆమె కంపోజ్ చేసిన పాటల పేర్లను శరీరమంతా టాటూలుగా వేయించు కొన్నాడు. ఛాతి మీద సైరస్ పేరు, రెండు భుజాలకూ సైరస్ బొమ్మలు, చేతులు, కాళ్లు, పొట్ట, చేతి వేళ్లు, వీపు మీద, మెడ వెనుకభాగం... మొత్తం ఇతడి శరీరం మీద సైరస్‌కు సంబంధించి 22 టాటూ లున్నాయి. దీన్ని బట్టి ఇతడికి మిల్లీ సైరస్ వైరస్‌లా సోకిందని అనుకోవాలేమో!
 

Advertisement
 
Advertisement
Advertisement