నన్నడగొద్దు ప్లీజ్‌ 

love doctor solve the problems - Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సార్, నేను ఒక అమ్మాయిని లవ్‌ చేస్తున్నా. వన్‌ సైడ్‌ లవ్‌. వన్‌డే ఆమెకు ప్రపోజ్‌ చేశాను. ఆమె ‘పెళ్లి ఫిక్స్‌ అయ్యింది’ అని చెప్పింది. ఆ తరువాత ‘నాకు బాయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడు’ అంది. ఆ తరువాత ‘నన్ను ఎందుకు లవ్‌ చేస్తున్నావ్‌?’ అని అడిగింది. నేను రీజన్‌ చెప్పాను. దాంతో ‘నాకు పెళ్లి ఫిక్స్‌ కాలేదు, బాయ్‌ ఫ్రెండ్‌ కూడా లేడు’ అంది. తను ముస్లిం, నేను హిందు. ఆ అమ్మాయి వాళ్ల ఇంట్లో ఒప్పుకోరు అంటోంది. ఒప్పుకోవాలంటే ఏం చెయ్యాలి అని అడిగాను. ‘గవర్నమెంట్‌ జాబ్‌ ఉండాలి’ అంది. జాబ్‌ ఉంటే చాలా? ఒప్పుకుంటారా? అని అడిగితే... ‘ఏమో ఒప్పుకోకపోవచ్చు.. తెలీదు..!’ అంటోంది. అసలు.. ఆ అమ్మాయి... నన్ను లవ్‌ చేస్తుందా? లేదా? ఒకవేళ చేస్తే ఒప్పుకుంటారా? లేదా? ఇది నా డౌట్‌! మీరే చెప్పాలి బ్రదర్, ప్లీజ్‌. – శ్రీకాంత్‌
అన్నా.... అమ్మాయి లవ్‌ చెయ్యడం లేదు! ‘పాషాణ హృదయులు సార్‌ మీరు!’ నిజం చెబితే ఉలుకెందుకు? ‘అయినా అంత కఠోరంగా చెబుతారా సార్‌?’ ఇడ్లీలో గుంత చేసి, దాంట్లో నెయ్యి పోసి చెప్పాలా??
‘వడలో ఆల్‌రెడీ హోల్‌ ఉంటుంది కదా సార్‌.. దాంట్లో నెయ్యి వేసి ఇవ్వచ్చు కదా సార్‌? ఇడ్లీ ఎందుకు సార్‌????’ చూశావా? ఇడ్లీ ఉడకపెడతారు.. వడ వేయిస్తారు..!! ‘అయితే ఏంటి సార్‌??’ మనమిద్దరం ఏమి మాట్లాడుతున్నామో శ్రీకాంత్‌కి అర్థం కావడం లేదు! ‘శ్రీకాంత్‌కి ఏంటి సార్‌.. నాకే అర్థం కావడం లేదు. నాకు డౌట్‌.. మీకు కూడా అర్థం కావడం లేదు అని సార్‌??’కరెక్టుగా చెప్పావు నీలాంబరీ.. ఆమెది ఇడ్లీ లాంటి లవ్‌.. శ్రీకాంత్‌ది వడ లాంటి లవ్‌. అమ్మాయి ఎన్నో రకాలుగా మనకు వర్కౌట్‌ కాదని చెబుతూనే ఉంది.. కానీ... ‘కానీ ఏంటి సార్‌??’

శ్రీకాంత్‌ ఇడ్లీని నూనెలో వేయించి.. వడని నీళ్లల్లో ఉడకబెట్టమంటున్నాడు.‘అన్యాయం సార్‌...! మతాలు వేరు అయితే.. ప్రేమలు ఉండకూడదా సార్‌??’ఇక్కడ మతాలతో సంబంధం లేదు. అమ్మాయికి ఇడ్లీ ఇష్టం. మనోడికి వడ కావాలి. సేమ్‌ కిచెన్‌ వర్కౌట్‌ కాదని అమ్మాయి సున్నితంగా చెబుతోంది. కానీ, శ్రీకాంత్‌ తన వేగుతున్న వడ సౌండ్‌లో విషయం వినిపించుకోవడం లేదు.‘ఓకే సార్‌.. అట్లా అయితే శ్రీకాంత్‌ అమ్మాయిని ఇక ఇబ్బంది పెట్టడు...! మీకు అరటిపండు వేయించుకుని తెస్తా...’ అంటూ నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.  లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, 
బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top