నన్నడగొద్దు ప్లీజ్‌  | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Dec 26 2017 12:00 AM | Updated on Dec 26 2017 12:00 AM

love doctor solve the problems - Sakshi

హాయ్‌ సార్‌! నేను మా కాలేజ్‌లో ఒక అమ్మాయిని చాలా ప్రేమిస్తున్నాను. ఎంతగా అంటే తనకోసం సూసైడ్‌ అటెంప్ట్‌ కూడా చేశాను. తను మాత్రం ‘నాకు ఫ్యామిలీ కావాలి’ అంటోంది. తనని మరిచిపోవడమంటే నన్ను నేను చంపుకోవడమే అవుతుంది. తను నాతో కొన్నిసార్లు హ్యాపీగా ఉంటోంది. కోపంగా ఉంటోంది. బాధగా ఉంటోంది. నువ్వు ఎందుకు అలా ఉంటావ్‌ అని అడిగితే.. ‘నేనంతే, ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలీదు’ అంటోంది. తనకోసం నా ఫ్యామిలీని కూడా వదులుకునేంత పిచ్చి సార్‌ నాకు... తనని నేను ఎలాగైనా మరచిపోవాలి సార్‌.. ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. సలహా ఇవ్వగలరు. – రఘు
రఘు.. రఘు.. రఘు.. ప్రేమకు బూజు పట్టింది. ఇంకా అక్కడెక్కడో... లాంగ్‌ టైమ్‌ బ్యాక్‌ లవ్‌ స్టోరీలే చూస్తున్నాం.  ‘దులుపుకుంటే పోద్దా సార్‌ ప్రేమ?’ అమ్మాయి దులుపుకున్న తర్వాత కూడా మనం వలపుకుంటూ ఉంటే లవ్వుకు లీజు దొరకదు. బూజే దొరుకుతుంది.  ‘లీజంటే ఏంటి సార్‌?’ గుండెలో ప్రేమకు ఓ అద్దె గది.  ‘ప్రేమ పాడుబడ్డ ఇల్లు లాంటిది సార్‌! మీ సమాధానాల చీపురుతో బూజు దులపాలి సార్‌!’ రఘుని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. డోంట్‌ బి డిప్రెస్డ్‌ రఘు.. ప్రేమికులకు కూడా మంచిరోజులొస్తాయి. అమ్మాయికి మూడ్‌ స్వింగ్స్‌ ఉన్నాయి. ‘సార్‌.. మూడ్‌ స్వింగ్స్‌ అంటే ఏంటి సార్‌???’
ఇప్పుడే నవ్వుతారు.. సడన్‌గా రెండు పీకుతారు. అబౌట్‌ టర్న్‌ కొట్టి మళ్లీ స్మైల్‌ ఇస్తారు.  ‘మళ్లీ పీకుతారు.. ఎందుకు సార్‌ ఇలా చేస్తారు మీ సిస్టర్స్‌.. అబ్బాయిలు పిచ్చోళ్లయిపోతారు కదా సార్‌???’

అబ్బాయంటే ఇష్టమే కానీ, మమ్మీడాడీని హర్ట్‌ చెయ్యడం ఇష్టం లేదు.. అటా..?! ఇటా..?! అని కొట్టుకుంటుంది మైండ్‌.. అందుకే ఒక్కోసారి.... ‘నవ్వుతారు.. సడన్‌గా పీకుతారు.. ఇప్పుడు రఘు ఏం చెయ్యాలి సార్‌???’ నవ్వినప్పుడు ఎగేసుకుంటూ పోకూడదు.. పీకినప్పుడు అదోలా ముఖం పెట్టకూడదు.. అమ్మాయికి టైమ్‌ ఇవ్వాలి.. స్పేస్‌ ఇవ్వాలి!! ‘పెళ్లి కూడా చెయ్యాలా సార్‌.. భలే చెబుతారు సార్‌.. ఏమైపోతాడు సార్‌ లవర్‌ రఘూ???’ ఏంటి అయ్యేది!?! అయిపోయేది!!?? ఇంతేనా లైఫ్‌!?? ఒక ప్రేమ.. ఒక పిచ్చి.. ఒక ఎమ్టీనెస్‌! అరే నిలబడాలి.. ప్రేమ కుమ్మినా నిలబడాలి... గట్టిగా ఊపిరి పీల్చి స్వేచ్ఛను ఆహ్వానించాలి. ప్రేమ ఊబి నుంచి బయట పడాలి. గుండెను దిటవు చేసుకుని.. లైఫ్‌ని మళ్లీ జీవించేయాలి. అప్పుడు చూడు.. ప్రేమ ఎక్కడినుంచో వచ్చి.. రఘు లైఫ్‌ని మళ్లీ తట్టి ఆనందాన్ని నింపుతుంది! ‘ఓకే రఘు.. ఫర్గెట్‌ దిస్‌ గర్ల్‌.. ఫర్గెట్‌ దిస్‌ పెయిన్‌! ఫర్గెట్‌ దిస్‌ డిప్రెషన్‌..!! ఎంజాయ్‌ లైఫ్‌!!!!!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌ 

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం  మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం  అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,  రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement