నన్నడగొద్దు ప్లీజ్‌  | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Dec 21 2017 11:57 PM | Updated on Dec 21 2017 11:57 PM

love doctor solve the problems - Sakshi

హాయ్‌ అన్నయ్యా! నాది చాలా విచిత్రమైన సమస్య. నేను ఒకతనిని ప్రేమించా. తనకి నా ప్రేమ అర్థం కావడానికి ఐదేళ్లు పట్టింది. మేం ఒకరిని వదిలి ఒకరం ఉండలేం. అదే విషయం వాళ్ల ఇంట్లో చెప్పాడు. వాళ్లు ఓకే అన్నారు కానీ, అమ్మాయి ఇంట్లో ఒప్పుకుంటేనే చేసుకో అన్నారట. దాంతో మా ఇంట్లో కూడా విషయం చెప్పాను. అయితే ఒప్పుకోలేదు సరికదా.. చచ్చిపోతాం అని బెదిరించారు. తను లేకుండా నేను ఉండలేను అంటే.. ‘26 ఏళ్లు పెంచిన మాకంటే నీకు అతనే ఎక్కువైపోయాడా అంటున్నారు. ఎలాగో ఒప్పుకోవడం లేదని.. ఎక్కడ విడదీస్తారో అనే భయంతో పెళ్లి చేసేకున్నాం. ఇప్పుడు ఇంట్లో చెప్పాలంటే భయమేస్తోంది. ఎలా రియాక్ట్‌ అవుతారో అని భయంగా ఉంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. దయచేసి అరటిపండు యూజ్‌ చెయ్యకుండా సలహా ఇవ్వండి.  – స్పందన
పెళ్లి.... చేసేసుకున్నారా..? ఎక్కడా...? ఎప్పుడూ..? ‘సార్‌ ఎందుకూ అని మాత్రం అడగకండి.. అడిగితే వద్దన్నారు.. లేదా చేసుకుంటాను అంటే.. ఓవర్‌ మై డెడ్‌ బాడీ అన్నారు. ప్రేమను చంపకోలేక అమ్మానాన్నలను చావు అంచులో ఉంచలేకా.. పెళ్లి చేసుకున్నారు సార్‌! ఏ గుడిలోనో.. సడి లేకుండా చేసుకున్నారు.. ఇప్పుడేం చెయ్యాలో చెప్పండి సార్‌..! దమ్ముంటే పరిష్కారం చెప్పండి సార్‌!!’ ఏం చెప్పాలి నీలూ..? ఇక్కడ టెన్షన్‌తో చెమటలు కారిపోతున్నాయి.. ఏది చెప్పినా డేంజరే... ‘అవును సార్‌ కరెక్టుగా చెప్పకపోతే షాప్‌ క్లోజ్‌ చేసుకుని ఇంటికి పోవాల్సిందే సార్‌.. బి కేర్ఫుల్‌!’ నువ్వు అంతగా చెప్పాలా నీలూ.. ఇదిగో చెబుతున్న కాస్కో!

‘సార్‌ నేను రెడీ.. కాసుకున్నా క్యాచ్‌ పెట్టుకుంటా.. స్పందనా బీ రెడీ!’  ఇంకేం చేస్తాం బంగారం? ముందు గుడికి వెళ్లు. దేవుడికి అన్నీ తెలిసినా.. ఒకసారి మనస్పూర్తిగా మీ నాన్నకు అమ్మకు చెప్పుకున్నట్టు దేవుడికి చెప్పుకో.. ఒక నాలుగు రోజులు ప్రతి రోజు దేవుడికి ఇదే విషయం చెప్పు.. ఇరవై ఆరేళ్ల ప్రేమ.. అమ్మానాన్నలదైతే.. ఇంకో డబ్భై నాలుగేళ్లు ప్రేమ మీది కావాలి అని కోరుకో.. నిన్ను చూసుకున్న దానికంటే ఇంకా ఏంటో ఎక్కువ ప్రేమతో అమ్మను నాన్నను చూసుకుంటానని దేవునికి చెప్పు..‘సార్‌ ఇలా దేవునికి చెప్పుకుంటే ఏమవ్వుద్ది సార్‌???’అద్భుతం జరుగుద్ది. నాలుగు రోజులు దేవునితో మాట్లాడుకున్నాక ఒక అద్భుతమైన ఐడియా తగులుద్ది!‘సార్‌ మీరు చాలా చాలూ సార్‌! ఆన్సర్‌ మీకు తెలియక దేవుడి మీదకు నెట్టేశారు కదా సార్‌.. దేవుడు మిమ్మల్ని క్షమించడు సార్‌! లవర్స్‌ కూడా క్షమించరు సార్‌.. గుడి బయట అరటిపండ్లు అమ్ముకోవాల్సిందే సార్‌!’నీకేమి తెలుసు నీలూ.. నేనెప్పుడూ ఆన్సర్లు ఇవ్వలేదు.. నేనే ఇచ్చాననుకోవడం మూర్ఖత్వం.. అలా అనుకుంటే పొగరు ఎక్కువై లైఫ్‌ ఖతం అయిపోతుంది. ఉత్తరం చదివినప్పుడు నాకు వాళ్ల అయోమయం కనబడుతుంది. ఆ తరువాత కాసేపు బ్లాంక్‌ స్క్రీన్‌ని చూస్తూ ఉంటే ఆన్సర్‌ దానికదే వచ్చేస్తుంది. ఐ లవ్‌ లవర్స్‌.. అది చాలు.. ఆన్సర్‌ దేవుడే పంపిస్తాడు!‘ఏంటో సార్‌ మీరు చెబుతుంటే నమ్మబుద్దేస్తుంది. స్పందనా నిజమేనేమో! దేవుడు నిన్ను అమ్మానాన్నలనూ హ్యాపీగా ఉంచుతాడనే అనిపిస్తుంది.. ఆల్‌ ది బెస్ట్‌!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని  గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.  లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement