నన్నడగొద్దు ప్లీజ్‌

love doctor solve the problems - Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ అన్నయ్యా! నేను చందు అనే అబ్బాయిని సిక్స్‌ ఇయర్స్‌గా ప్రేమిస్తున్నా. అయితే అన్నీ గొడవలే అన్నా. ఎప్పుడూ ఏదో ఒక అనుమానం. ఎందుకు ఇలా అని అడిగితే ‘‘నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ’’ అంటాడు. ‘‘నువ్వు ఎవరినైనా చూస్తే నేను తట్టుకోలేను’’ అంటున్నాడు. మారతాడేమో అని చాలా వెయిట్‌ చేశా. రోజురోజుకీ ఎక్కువ అవుతోంది. దుబాయ్‌లో ఉన్నాడు కదా.. అందుకే అలా ఉన్నాడేమో.. పెళ్లి చేసుకుంటే మారతాడులే అనుకుంటున్నా. చివరికి నా ఫోన్‌ బిజీ వచ్చినా అనుమానమే. నాకు తనంటే ప్రాణం అన్నయ్యా. తనని వదిలేసి ఉండలేను అందుకే ప్రాణం పోతోంది. తనని ఎలా మార్చుకోవాలి? ‘‘చందుని పెళ్లి చేసుకోవద్దు, అంత అనుమానం ఉన్నవాడితో బతకడం కష్టం’’ అంటున్నారు అంతా. నేను పిచ్చిదాన్ని అయిపోతే బాగుండు అనిపిస్తుంది. ఎవరితో మాట్లాడినా అనుమానం అన్నయ్యా తనకి! నా లైఫ్‌ ఏంటి అన్నయ్యా చెప్పండి? – నీలిమ
ప్రేమకు, అబ్సెషన్‌కు తేడా తెలుసుకో...‘అబ్సెషన్‌ అంటే ఏంటి సార్‌?!’ అబ్సెషన్‌ అంటే.......‘సార్‌ అసలు ఇలాంటి పెద్ద పెద్ద పదాలు పెట్టి మీ ఇంటెలిజెన్స్‌ చూపించుకోవడానికి ట్రై చెయ్యకండి సార్‌..! బీ సింపుల్‌ సార్‌..!! మీరు చాలా ఇంటెలిజెంట్‌ అని ఆల్‌రెడీ తెలుసు సార్‌..! మరెందుకు సార్‌ షో ఆఫ్‌ చేస్తున్నారు!?!’అంతా వెటకారమే కదా నీలాంబరీ?‘ఏంటి సార్‌!! ఇంటెలిజెంట్‌ అని చెప్పినా వెటకారం అంటారా??’
‘‘మీరు అసలు డాక్టరే కాదు..! మీకేం తెలుసు..??.. అరటిపండు మెక్కడం తప్ప? మీకంటే నేనే బాగా చెబుతా ఆన్సర్లు!’’ ఇవన్నీ నువ్వు ఎప్పుడూ చెప్పేవే కదా నీలాంబరీ..!! నా మీద అంత తక్కువ రెస్పెక్ట్‌ ఉన్న నీవు... సడన్‌గా ‘‘ఇంటెలిజెంట్‌’’ అంటే వెటకారం అనిపించదా..???‘నిజం చెప్తా సార్‌..!! ఒక్కోసారి నాకు తెలియని మాటలు.. ఇంగ్లీషులో మాటలు.. చెప్పి మీరు చాలా ఇంటెలిజెంట్‌ అని ఫ్రూవ్‌ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది!!’

అరటిపండు కావాలంటే నిన్ను ఇంప్రెస్‌ చెయ్యాలి కదా నీలూ!!‘సరే సార్‌ అతి తెలివి డైలాగులు కొట్టకుండా సింపుల్‌గా నీలిమకు సమాధానం చెప్పండి సార్‌!’బంగారం..! ఆ అబ్బాయికి అబ్సెషన్‌ డిజార్డర్‌ ఉంది. అంటే ఓ రకంగా చెప్పాలంటే పిచ్చి ప్రేమ లాంటిది. చాలా ఇన్‌సెక్యూర్‌గా ఉంటారు. ఎక్కడ పోగొట్టుకుంటానో అన్న భయంతో జీవిస్తారు. ట్రస్ట్‌ అంటే.. మనుషుల మీద నమ్మకం చాలా తక్కువగా ఉంటుంది. ప్రేమించేటప్పుడే ఇలా ఉన్నాడంటే.. పెళ్లయ్యాకా సైకోలా ప్రవర్తిస్తాడు. వద్దమ్మా! ఇలా శ్వాస కూడా తీసుకోనివ్వని ప్రేమ మనకొద్దు!! గొంతు పిసికేసినట్టు అనిపిస్తుంది రా బంగారం!! నీ ఉత్తరం చదువుతుంటేనే నాకు ఊపిరి ఆడలేదు. ఓవర్‌ ఎమోషనల్‌ అవ్వద్దు. కొంచెం ఆలోచించు ప్లీజ్‌!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. lovedoctorram@sakshi.comలవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్,హైదరాబాద్‌–34.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top