నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Nov 1 2017 1:08 AM | Updated on Nov 1 2017 3:00 AM

love doctor solve the problems

హాయ్‌ సర్, నా వయసు ఇరవై, నేను మా క్లాస్‌లో ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నా. తను నన్ను అప్పుడప్పుడూ చూస్తుంది. తనకి ప్రపోజ్‌ చేద్దాం అనుకుంటున్నా. కానీ తను చాలా సెన్సిటివ్, ఒకవేళ తనకు నేను ప్రపోజ్‌ చేస్తే ఎలా రియాక్ట్‌ అవుతుందో అని భయంగా ఉంది సార్, ఏమైనా సలహా ఇవ్వండి సార్‌ ప్లీజ్‌. – శ్రీనివాస్‌ రావు

గాఢంగా ప్రేమిస్తే ఇదే ప్రాబ్లమ్‌ అన్నా..! ‘ప్రేమిస్తే ప్రాబ్లమ్‌ ఏంటి సార్‌?’ గాఢంగా..! ‘అవును సార్‌ గాఢంగా ప్రేమిస్తే కూడా అబ్బాయిలది తప్పేనా సార్‌?’ తప్పు అన్నానా? ప్రాబ్లమ్‌ అన్నాను!! ‘ఏంటి సార్‌ ప్రాబ్లమ్‌?’ అమ్మాయి పోరా అంటే... ‘ఇంకొకరిని గాఢంగా ప్రేమిస్తారు అబ్బాయిలు.. చాలా స్ట్రాంగ్‌ సార్‌ అబ్బాయిలు!’ ఎవరినో ఒకరినయినా గాఢంగా ప్రేమిస్తూనే ఉంటారా నీలూ..? ‘ఎస్‌ సార్‌ బాయ్స్‌ ఆర్‌ స్ట్రాంగ్‌!!’ ఒకరు కాదంటే ఇంకొకరిని గాఢంగా... ‘ఏంటి సార్‌ ఇన్ని సార్లు అడుగుతున్నారు ఎనీ డౌట్స్‌?!?’ శ్రీనివాస్‌రావు మంచివాడు.. మంచి ప్రేమికుడు.. గాఢంగా ఒకరినే ప్రేమించే టైప్‌ పోరగాడు.. అమ్మాయి నో అంటే గుండె పగిలిపోతుంది. అందుకే అలా టెన్షన్‌లో ఉన్నాడు.. మంచి గాఢమైన టెన్షన్‌లో ఉన్నాడు. బెస్ట్‌ ఏంటంటే దూరంగా ఉండి గాఢంగా ప్రేమిస్తూ ఉంటే ఏ ప్రాబ్లమ్‌ ఉండదు!!
‘ఊరికే పెంట ఐడియాలు ఇవ్వకండి సార్‌.. అలా అయితే అమ్మాయికి అసలు తెలియదు కదా?’

తిరస్కారం కంటే అజ్ఞాతం బెటర్‌ కదా? ‘తెలుగులో చెప్పండి సార్‌!’ చెబితే ముందు చెంప తరువాత గుండె ఆ తరువాత... ‘ఆ తరువాత ఏమి జరుగుద్దో మాకు తెలుసు సార్‌.. ఏమి చెయ్యాలో చెప్పండి...’ గాఢంగా లవ్‌ చెయ్యాలి.. చేస్తూ ఉండాలి.. ఆ ప్రేమ ఎనర్జీ ఒక రోజు తప్పకుండా అమ్మాయిని టచ్‌ చేస్తుంది! ‘అప్పుడు అమ్మాయి ఓకే అంటే హ్యాపీ ఎండింగ్‌.. ఒకవేళ నో అనుకున్నా చెంప పగలదు.. కాబట్టి అది కూడా హ్యాపీ ఎండింగే. యు ఆర్‌ బ్రిలియంట్‌ సార్‌!’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com

Advertisement
 
Advertisement
Advertisement