నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్! నాకు మ్యారేజ్ అయింది. కానీ పెళ్లికి ముందు ఒక అబ్బాయిని లవ్ చేశాను. ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ నేపథ్యాలు వేరుకావడంతో.. పెళ్లి చేసుకోలేకపోయాం. ఇప్పుడుఇద్దరికీ వేరువేరు పెళ్లిళ్లు అయిపోయాయి. మా ఇద్దరికీ పిల్లలు కూడా పుట్టారు. కానీ మా ఇద్దరి మధ్య ప్రేమ చావడం లేదు. నా భర్త, తన వైఫ్ ఇద్దరూ చాలా మంచివాళ్లు. ఇప్పుడు ఏం చెయ్యాలి?- శ్రీలత
‘సార్....!!!!’ ఎస్... నీలాంబరీ...!? ‘ఎదో ప్లాన్ ఉన్నట్టు ఉంది సార్...’ ప్లానా..? ‘మిమ్మల్ని ప్యాక్ చెయ్యడానికి ప్లాన్ సార్..! నేనేమయినా బిస్కెట్టా ప్యాక్ చెయ్యడానికి?? ‘కాదు సార్ మీరుపదహారణాల అరటిపండు.. సార్.. కానీ.. ఈ క్వశ్చన్‌కి ఏ ఆన్సర్ ఇచ్చినా ఉద్వాసనే సార్?’ ఉద్.. వాసనా అంటే.. పండిపోయిన అరటిపండు వాసనా? ‘శ్రీరాముడిని అడివికి పంపించినట్టుసార్...’ ఆన్సర్ చెబితే అడివికి పంపిస్తారా... హౌ? ఈ క్వశ్చన్ వెనకాల ఏదో కుట్ర కనబడుతోంది సార్.. మిమ్మల్ని పంపించెయ్యడానికి! అయినా బెదరక అదరక ఆన్సర్ ఇచ్చెయ్యండి సార్..మిమ్మల్ని పంపిస్తే మీ ప్రాక్టీస్ నేను కాపాడుతాను సార్!!’ థ్యాంక్యూ నీలాంబరీ.. శ్రీలత మనసుకు అదుపు ఉండదు.అందుకే దాన్ని మార్చలేని మనసు అన్నారు. ప్రేమకు పిచ్చి ఉంటుంది. అందుకే దాన్ని మార్చలేని ప్రేమ అన్నారు. ఎమోషన్‌కు బ్రేక్ ఉండదు. అందుకే దాన్ని మార్చలేని ఎమోషన్అన్నారు. గతానికి పాదముద్రలు ఉంటాయి.
అందుకే దాన్ని మార్చలేని గతం అంటారు. ప్రజెంట్ అంటే వర్తమానం అందుకే దానిని మరువకూడని ప్రజెంట్ అంటారు. ప్రజెంట్ అంటే గిఫ్ట్అని కూడా. మార్చలేనివి ఎన్ని ఉన్నా... నీ పిల్లలు నీ కుటుంబం నీ ప్రజెంట్ ప్రపంచంలోని బెస్ట్ గిఫ్ట్స్. గతం నుంచి ఎంతో ధైర్యంగా ఏడు అడుగులు నడిచి ముందుకు వచ్చావు తల్లీ..ఇప్పుడు వెనక్కి తిరిగి చూడకు. నీకు దండం పెడ్తా. నువ్వు మా బంగారం. ‘ఎవరు సార్ మీ మీద కుట్రలు చెయ్యగలిగింది??’ మన ఆవేశంతో మన ప్రజెంట్ మీద మనం చేసుకునే కుట్ర!! మన లైఫ్‌ని ఎవరూ పాడుచెయ్యలేరు... మనం తప్ప!! ఎవరూ బాగుచెయ్యలేరు... మనం తప్ప!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com
సంబంధిత వార్తలు