నాకంటే ఏడాది పెద్దది.. ప్లీజ్‌ సలహా ఇవ్వండి! | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Oct 6 2017 11:34 PM | Updated on Dec 18 2017 1:42 PM

 love doctor solve the problems - Sakshi

హాయ్‌ సర్‌! నేను, మా అత్త కూతురు ఐదేళ్లుగా లవ్‌ చేసుకుంటున్నాం. ఇద్దరం టీచర్‌ జాబ్‌కి ట్రై చేస్తున్నాం. తను నాకంటే వన్‌ ఇయర్‌ పెద్దది. బట్‌ ఇద్దరం చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నాం. తనంటే నాకు చాలా ఇష్టం. నేను అంటే తనకు ప్రాణం. మా ఫ్యామిలీస్‌ మధ్య ఉన్న గొడవలతో తనని నాతో మాట్లాడొద్దని ఫోర్స్‌ చేసేవారు వాళ్ల పేరెంట్స్‌. అయితే తను నాతో మాట్లాడుతూనే ఉండేది. ఏమైందో వన్‌ ఇయర్‌ నుంచి నాతో మాట్లాడటం మానేసింది. నాకు ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. తను లేకుండా నేను ఉండలేను సార్‌. ప్లీజ్‌ ఏం చెయ్యమంటారో సలహా ఇవ్వండి!
– అరవింద్‌

‘సార్‌ మీ ఆన్సర్‌ నాకు ఆల్రెడీ తెలుసు!’ నువ్వు మేధావివి నీలాంబరీ!! ‘సార్‌ జోక్‌ కాదు మీ ఆన్సర్‌ ఏంటో నాకు ఆల్రెడీ తెలుసు సార్‌!!’ మరి నువ్వే కాపాడు అరవింద్‌ గారిని!! ‘ఏంటి సార్‌ యంగ్‌ బాయ్‌ని పట్టుకుని గారు గీరు అంటున్నారు?’ అరవింద్‌ బాగా ఎదిగిపోయాడు కాబట్టి!! ‘సార్‌ సబ్జెక్ట్‌ మార్చేస్తున్నారు మీ ఆన్సర్‌ నేను చెప్పనా?’ ఓకే.. ‘మీరు ఫీల్‌ కాకూడదు సార్‌!’ ఓకే.. ‘అరవింద్‌ నీ క్వశ్చన్‌ ఇంకో లవ్‌ డాక్టర్‌కి రాసుకో.. ఈ డాక్టర్‌ అత్త కూతురితో పెళ్లికి ఒప్పుకోడు. ఎందుకంటే.. ‘పుట్టే పిల్లలకు ప్రాబ్లమ్స్‌ వస్తాయని.. కరెక్ట్‌గా చెప్పానా సార్‌?’ యు ఆర్‌ గ్రేట్‌! ‘సార్‌.. మరి ఎందుకు సార్‌ అరవింద్‌ని ‘‘గారు’’ అన్నారు సార్‌?’ అమ్మాయి వయస్సు ఎక్కువయినా ప్రేమించే మనస్సు ఎదిగిన మనస్సు కదా! అత్త కూతురు కాకపోతే బాగా ఎంక్రేజ్‌ చేసే వాణ్ణి!! ‘సార్‌... కూతలు కూయకండి సార్‌....!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement