నన్నడగొద్దు ప్లీజ్‌

love doctor solve the problems - Sakshi

లవ్‌ డాక్టర్‌

Hello sir! I always love the way you answer questions. You put it in such a humorous, sarcastic yet to the point. I often thought of sharing my feelings out with you. Right now, I have the love of my life. He cares for me and I know it is true. I love him too. I had to move to a distant place, and my love is worried. I asked him to wait two years, at least one, so we could marry. He is often frustrated and I do not know how to tackle this. Will you be kind enough to say how I should deal please? -  Asha Not to worry buddy! Relationships are tested by time. There can't be a better test. Let him wait. If he is frustrated, he needs to understand love better. value it. weigh it with consequences. And he has to learn that constrictions and limitations don't let love grow. The free will and spirit of love is the only thing that will live eternally between both of you.

‘సార్‌ ఆశ ఇంగ్లీష్‌లో రాసింది. మీరు ఇంగ్లీష్‌లో చెబుతున్నారు. చదివే వాళ్లు తెలుగులో చదవాలి. మీకు ఉద్యోగం ఇచ్చిన పెద్దలు తెలుగు పిల్లల భవిష్యత్తు జాగ్రత్తగా చూసుకోమని జీతం కొడుతున్నారు.. మీరు రెచ్చిపోయి వచ్చిన రెండు ఇంగ్లీష్‌ మాటల్తో స్టైల్‌ కొడుతున్నారు. ఎలా సార్‌? మా లాంటి తెలుగు రీడర్స్‌కి అర్ధమయ్యేది?’ పెంట చెయ్యకు చెబుతా. ఆశ అండ్‌ బాయ్‌ లవ్లో ఉన్నారు. బాయ్‌ పెళ్లి టుడే అంటున్నాడు. ఆశ వన్‌ ఇయర్‌ వెయిట్‌ చెయ్యమంటుంది. ఆశ ఊరికిపోతుంది. వాడు ఉడికిపోతున్నాడు. ఇప్పుడేమి చెయ్యాలి వాడికి ఏమి చెప్పాలి? అన్నది క్వశ్చన్‌!! ‘యు ఆర్‌ సో స్వీట్‌ సార్‌ ఇప్పుడు మీ ఆన్సర్‌ చెప్పండి తెలుగులో ప్లీజ్‌!!’ సమయాన్ని మించిన పరీక్ష ప్రేమకు ఉండదు అని చెప్పా!! ‘సార్‌.. చాలా రాశారు ఇంకేమి చెప్పారో చెప్పండి సార్‌!!’ జీవితమన్న మజ్జిగను చిలికి చిలికి వెన్న తీయాలి ఆ వెన్న ఉడికి.. ఉడికి.. ‘అంటే ఆ అబ్బాయిలా ఉడికి కదా సార్‌?’ నువ్వు చాలా ఇంటెలిజెంట్‌ నీలాంబరీ.. ఉడికి ఉడికి ప్రేమ అనే నెయ్యి కావాలి అని చెప్పా..! ‘వేడివేడి అన్నంలో పప్పు, ఆవకాయ ఈ నెయ్యి వేసి సంసారం చెయ్యాలి కదా సార్‌!!’చాలా ఇంటెలిజెంట్‌!!-
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top