నన్నడగొద్దు ప్లీజ్‌  | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Apr 27 2018 12:35 AM | Updated on Apr 27 2018 12:35 AM

love doctor solve the problems - Sakshi

హాయ్‌ రామ్‌ అన్నయ్యా..! నేనొక అబ్బాయిని లవ్‌ చేస్తున్నా. తను కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు. నేను లేకపోతే చచ్చిపోతా అంటాడు. బట్‌ నేను వేరే అబ్బాయిలతో మాట్లాడితే సహించలేడు. ఎవరితోనూ మాట్లాడొద్దు అంటాడు. బట్‌ నాకు కూడా ఫ్రెండ్స్‌ ఉంటారు కదా అన్నయ్యా. వాళ్లతో కూడా మాట్లాడకపోతే వాళ్లు ఫీల్‌ అవుతారు కదా. మాట్లాడితే ఇతను ఫీల్‌ అవుతున్నాడు. ఏం చెయ్యాలి అన్నయ్యా? ప్లీజ్‌ ఒక మంచి సలహా ఇవ్వండి. – రెహానా
కొత్త ఫ్రెండ్స్‌ ఇంకొందరు దొరికితే చూడు బంగారం!‘చచ్చిపోతాడు సార్‌.. భరించలేక’మినిమం హండ్రెడ్‌ ఫ్రెండ్స్‌ని చూడు ఛాంపియన్‌...!‘సార్‌... కక్ష కట్టారా సార్‌ ఆ లవర్‌ మీద..?’హండ్రెడ్‌ డేస్‌ ఆ అబ్బాయికి కనబడేలా ఈ ఫ్రెండ్స్‌తో కుర్చో.‘సన్యాసం పుచ్చుకుంటాడు సార్‌!’ఒక్కో ఫ్రెండ్‌ను ఆ అబ్బాయికి ఇంట్రడ్యూస్‌ చెయ్యి.‘రోజుకు ఒకడినా సార్‌? అబ్బా ఎంత శాడిస్ట్‌ సార్‌ మీరు...’నీలాంబరి వాడేమైనా తక్కువ శాడిస్టా? నా బంగారం గౌరవంగా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుంటే వెర్రి వేషాలు వెయ్యట్లా?‘సార్‌ అది ప్రేమ సార్‌. లవర్‌ భరించలేడు సార్‌... తన గర్ల్‌ఫ్రెండ్‌ ఇంకో అబ్బాయితో మాట్లాడితే వాడి లైఫ్‌ చిరిగిన చాటే సార్‌. చింపిన విస్తరి సార్‌. పీలికల గుడ్డే సార్‌. పాపం ఆ బిడ్డ ప్రేమతో కుమిలిపోతుంటే మీరు, మీ సిస్టర్‌ కుళ్లబొడుస్తున్నారు కదా సార్‌! అనవసరంగా మీ చెల్లెళ్లకు ఇలాంటి టెక్నిక్‌లు నేర్పి అబ్బాయిల గుండెల్లోగునపాలు గుచ్చుతున్నారు సార్‌’ఆపు నీలాంబరీ ఆపు!!

‘ఏంటి సార్‌ ఆపేది? మీ సిస్టర్లైతే ఫ్రెండ్‌షిప్‌లు ఆపరుగానీ నేను ఆపాలా సార్‌?’పెళ్లికి ముందే ఇలా ఉన్నాడంటే.. రేపు పెళ్లయ్యాక.. ఆఫీసులో ఎవరితోనో మాట్లాడిందని, కాలనీలో ఎవరితోనో మాట్లాడిందని, టార్చర్‌ చేస్తూ ఉంటే బతికేదెలా? అందుకే వాడికి ట్రైనింగ్‌ అవసరం. అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్‌ని ట్రెయిన్‌ చెయ్యకపోతే బ్యాడ్‌ హజ్‌బెండ్స్‌ అవుతారు నీలాంబరీ..!‘ఈ కుక్కలను ట్రెయిన్‌ చేసే బదులు ఇంకో సింపుల్‌ ట్రిక్‌ చెప్పండి సార్‌ ప్లీజ్‌!!’ లవర్స్‌ ఇద్దరూ సంతోషంగా ఉండాలంటే ఉండాల్సింది ప్రేమ ఒక్కటే కాదు నీలూ.. నమ్మకం కూడా!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌ 

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయంమిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,  రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement