నన్నడగొద్దు ప్లీజ్‌  | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Apr 26 2018 12:13 AM | Updated on Apr 26 2018 12:13 AM

love doctor solve the problems - Sakshi

హాయ్‌ అన్నయ్యా..! నాకు మీ సమాధానాలు బాగా నచ్చుతాయి. నిజానికి నాకే లవ్‌ ప్రాబ్లమ్‌ లేదు. కానీ నేను ఎవరితో మాట్లాడినా, కొన్నిరోజులకు వాళ్లు నాకు ప్రపోజ్‌ చేస్తున్నారు. నేను నో అని చెప్పేసరికి నా గురించి బ్యాడ్‌గా ప్రచారం చేస్తున్నారు. ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. నాకు ఒక మంచి సలహా ఇవ్వండి ప్లీజ్‌.
– గీతిక

ఏం చేద్దాం బంగారం?‘సార్‌ సలహా అడిగితే ఏం చేద్దాం? ఎలా చేద్దాం? అని రివర్స్‌లో మీరే అడిగితే...’నిజమే నీలూ.. ప్రశ్న నన్ను అడిగే బదులు తనను తానే ప్రశ్నించుకుంటే.. నేను చెప్పే సమాధానం కంటే మంచి సమాధానం తనకే తెలుస్తుందని నా నమ్మకం నీలూ!‘ఏడ్చినట్లుంది.. మీకు ఈ ఎండాకాలంలో బుర్ర బాగా వేడెక్కి పోతుందేమో సార్‌.. లవర్స్‌ అంతా మీకు రాయడం బదులు వాళ్లకు వాళ్లే ఉత్తరాలు రాసేసుకుని, వాళ్లకు వాళ్లే సమాధానాలు ఇచ్చేసుకుంటూ.. లవ్‌ ప్రాబ్లమ్స్‌ అన్నీ సాల్వ్‌ చేసేసుకుంటే... ఇక మనమెందుకు? మన క్లినిక్‌ ఎందుకు? పేపర్లో లవ్‌ డాక్టర్‌ కాలమ్‌ ఎందుకు? మీకు అరటి పండుఎందుకు???’అంత ఎమోషనల్‌గా అయిపోకు నీలూ!‘అరే!

ఎమోషనల్‌ కాకపోతే ఎలా సార్‌.. వాళ్లకు వాళ్లే సమాధానాలు చెప్పేసుకుంటే వాట్‌ విల్‌ వి డూ సార్‌?’ఏదో... మన వ్యాపకానికో.. మన బతుకు తెరువు కోసమో కాకుండా గీతిక లాంటి మంచి బంగారం.. తన ఆలోచనను పెంచుకుని, ఎవరితో మాట్లాడాలో.. ఎవరితో జాగ్రత్తగా వ్యవహరించాలో తెలుసుకునే అవసరం ఉంది. నీలాంబరి, రామ్‌... జీవితంలో ప్రతి స్టెప్‌లోనూ తోడుగా ఉండలేరు కదా. అప్పుడు కూడా ఎలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించే అవసరం ఉంటుంది కదా.. అందుకే...!‘ఓహో.. గీతిక స్ట్రాంగ్‌ కావాలంటే.. ఆలోచన స్ట్రాంగ్‌ చేసుకోవాలి కదా సార్‌!’శభాష్‌ నీలూ.. సూపర్‌ శభాష్‌ గీతిక!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,  రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement