నన్నడగొద్దు ప్లీజ్‌  | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Apr 20 2018 12:49 AM | Updated on May 7 2018 2:01 PM

love doctor solve the problems - Sakshi

హాయ్‌ సార్‌..! నేనొక అమ్మాయిని ప్రాణంగా ఇష్టపడుతున్నాను. ఆ అమ్మాయికి కూడా నేనంటే చాలా ఇష్టం. నా సమస్య ఏంటంటే... తను ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడితే నాకు నచ్చదు. అందుకే ‘నాతో తప్ప ఎవరితోనూ మాట్లాడకు’ అంటూ తిడుతుంటాను. ఆ విషయంలో మా ఇద్దరికీ రోజూ గొడవే సార్‌. ‘నాతో మాట్లాడటం మానేసెయ్‌. కనీసం అప్పుడైనా నేను హ్యాపీగా ఉంటా’ అంటోంది. ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. తనపై ప్రేమనెలా తెచ్చుకోవాలి. మీరే ఒక సలహా ఇవ్వండి ప్లీజ్‌. – బుజ్జిబాబు
బుజ్జి బాబు.... మనం ఎదగాలి, పెద్ద మనసుతో ఆలోచించాలి.‘పెద్ద బాబు కావాలి కదా సార్‌!?’యు ఆర్‌ వెరీ స్మార్ట్‌ నీలూ..!‘పెద్ద మనసుతో ఆలోచించి, బుజ్జి బాబు ఏం చెయ్యాలిసార్‌? ’అమ్మాయినిబుజ్జగించుకోవాలి. కానీ...‘కానీ ఏంటి సార్‌?’గొడవపడితే ఎలా నీలూ...!?‘ఎలా బుజ్జగించాలి సార్‌?’అది కూడా మనమే చెబితే.. ఇక బుజ్జి ఎప్పుడు ప్రే...మిం...చా....లి..?? ఎప్పుడు.....?‘పెద్ద బాబు కావాలి అంటున్నారు కదా సార్‌’ యు ఆర్‌ సూపర్‌ స్మార్ట్‌ నీలాంబరి!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయంమిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,  రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement
 
Advertisement
Advertisement