నన్నడగొద్దు ప్లీజ్‌  | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Apr 17 2018 12:17 AM | Updated on Apr 17 2018 12:17 AM

love doctor solve the problems - Sakshi

హాయ్‌ అన్నయ్యా..! నా వయసు ఇరవై. నేనొక అమ్మాయిని వన్‌ ఇయర్‌గా లవ్‌ చేస్తున్నా. తనకీ నేనంటే  చాలా ఇష్టం. కానీ తనింకా మేజర్‌ కాదు.  మా ఇద్దరి విషయం వాళ్ల పేరెంట్స్‌కి తెలిసి బాగా తిట్టారు. దాంతో ‘నేనిక మా ఇంట్లో ఉండలేను, తీసుకెళ్లిపో’’అంది. ఇద్దరం వెళ్లిపోయాం. తర్వాత వాళ్ల పేరెంట్స్‌ నాపై పోలీస్‌ కేసు పెట్టారు. దాంతో పోలీసులు ఆ అమ్మాయిని వాళ్ల పేరెంట్స్‌కి అప్పగించారు. అప్పటి నుంచి నాకు తను ఫోన్‌ చెయ్యలేదు. తను మేజర్‌ అయ్యాక నా దగ్గరకు తిరిగొస్తుందా క్లారిటీ ఇవ్వండి ప్లీజ్‌? – కుమార్‌
తప్పకుండా వస్తుంది.‘ఏంటి సార్‌ వచ్చేది? వాళ్ల నాన్న ఊరుకుంటాడా?’చిన్న వయసులోనే ప్రేమను నమ్మి, కుమార్‌ని నమ్మి గడపదాటింది. అది అమాయకత్వమే కావచ్చు, మంచి చెడు తెలుసుకునే వయసు కాకపోవచ్చు, ప్రేమ కాకపోవచ్చు, మోజు కావచ్చు, ఆలోచన కాకపోవచ్చు, ఎగై్జట్‌మెంట్‌ కావచ్చు..!‘అంటే ప్రేమ కాకపోయినా ఈ రోజుల్లో యూత్‌ ఎగై్జట్‌మెంట్‌ కోసం చేసే పిచ్చి పని లాంటిదా సార్‌? అదే సార్‌... సెల్ఫీ కోసం కొండలెక్కడం, ట్రెయిన్‌ బయట తల పెట్టడం.. అలాంటిదేనా సార్‌ ఆ అమ్మాయి చేసింది?’అలా కూడా అయ్యుండొచ్చని కుమార్‌కి చెబుతున్నా..!‘మరి ఇప్పుడు కుమార్‌ ఏం చెయ్యాలి సార్‌?’ఫర్‌ ఎగ్జాంపుల్‌ కుమార్‌ సిస్టర్‌ లవ్‌లో పడి మేజర్‌ కాకుండానే లగెత్తితే.. కుమార్‌ ఏం చేస్తాడు?‘ఇంటికి తీసుకొచ్చి మంచి చెడు అర్థమయ్యేలా చెబుతాడు సార్‌. ‘‘అయిందేదో అయ్యింది నువ్వూ అబ్బాయి సెటిలయ్యి, మీ కాళ్ల మీద మీరు నిలబడ్డాక పెళ్లి చేసుకోండి’’ అని కుమార్‌ తన చెల్లెలికి చెబుతాడు సార్, మంచోడు కదా!’ మరి మన చెల్లికి, ఇంకొకరి చెల్లికి వేరువేరు నీతులు ఎలా కుమార్‌?????
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌
lovedoctorram@sakshi.com

Advertisement
 
Advertisement
Advertisement