
హాయ్ బ్రో...! నాకొక అబ్బాయంటే చాలా ఇష్టం. నేను అతనితో లైఫ్‌లాంగ్ కలిసుండాలని కోరుకుంటున్నా. అందుకే పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశాను. అతను నో అన్నాడు. కానీ నాతో చాలా క్లోజ్‌గా ఉంటాడు. లైక్ బాయ్‌ఫ్రెండ్‌లా. బట్ నన్ను లవ్ చెయ్యడం లేదట. ఎందుకని అడిగితే ‘క్యాస్ట్ ప్రాబ్లమ్, ఫ్యామిలీ ప్రాబ్లమ్’ అంటున్నాడు. సరేలే అని దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటే... ఇప్పటికీ నాతో క్లోజ్‌గానే ప్రవర్తిస్తాడు. గొడవైన ప్రతిసారి ఇక్కడితో చాలు అనుకుంటున్నా. బట్ తనే మళ్లీ ‘జెస్ట్ ఫ్రెండ్స్’ అంటూ మాట్లాడుతుంటాడు. నేను మెంటల్‌గా చాలా డిస్ట్రబ్ అవుతున్నాను. అలా అని అతనితో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి బ్రో...! – ఉష
పొల్యూషన్ ఎక్కువైనప్పుడు...‘దగ్గు వస్తుంది కదా సార్!’పొల్యూషన్ పెరిగినప్పుడు...‘జ్వరం వస్తుంది కదా సార్?’పొల్యూషన్ పీక్స్‌కి వెళ్తే????‘హాస్పిటల్‌కి పోవాలి కదా సార్?’అది కాదు నీలూ...!‘మరేంటి సార్????’లవ్ పొల్యూషన్ ఎక్కువైతే...‘లవ్ పొల్యూషన్ అంటే ఏంటి సార్???’మన లవ్‌కి వాల్యూ ఇవ్వని వాళ్లు మనతో మాట్లాడితే అది సౌండ్ పొల్యూషన్ నీలూ...‘అప్పుడు చెవులు మూసుకోవాలా సార్???’అంతే కదా నీలూ...! మన నోటికి కూడా పొల్యూషన్‌కి కట్టుకునే మాస్క్ వేసుకోవాలి.‘ఏది సార్ ఆ సైన్‌ఫ్లూ వచ్చినప్పుడు అందరూ కట్టుకునే మాస్క్ లాంటిదా సార్???’ఎగ్జాక్ట్‌లీ నీలూ.. యు ఆర్ వెరీ స్మార్ట్!‘సార్ అలా కట్టుకుంటే ఉషకి మాట్లాడాలనిపించినా మాట్లాడలేదు సూపర్ సార్!’ అవును ఉషా! మనల్ని గౌరవించకపోవడమే కాదు, మనల్ని వాడుకోవాలని చూస్తున్న వాడితో మాటలేంటిరా బంగారం?!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్