నన్నడగొద్దు ప్లీజ్‌  | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Apr 12 2018 12:16 AM | Updated on Apr 12 2018 12:16 AM

love doctor solve the problems - Sakshi

హాయ్‌ రామ్‌ అన్నయ్యా..! నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తను కూడా నన్ను లవ్‌ చేసింది. నాకన్నా ముందు ఒక అబ్బాయితో బ్రేకప్‌ అయ్యిందని తెలిసి కూడా ప్రేమించాను. అయితే మేం ప్రేమించుకుంటున్న విషయం మా ఇంట్లో తెలిసి... ‘‘ఆమె గురించి మాకంతా తెలుసు, తను మంచిది కాదు’’ అంటున్నారు. నాకు తెలిసిన ఆంటీ కూడా అదేమాట చెప్పింది. వాళ్ల మాటలతో కాస్త బాధనిపించి మాట్లాడం మానేశాను. కానీ తను అలాంటిది కాదు అనే నమ్మకంతో మళ్లీ ఫోన్‌ చెయ్యడం మొదలుపెట్టా. తిరిగి తనతో మాట్లాడుతున్నానని తెలిసి మళ్లీ ఇంట్లో గొడవైంది. ‘ఆమెతో మాట్లాడితే చచ్చిపోతాం’ అంటున్నారు. తనేమో ‘నీకోసం ఎన్ని రోజులైనా వెయిట్‌ చేస్తాను’ అంటోంది. మావాళ్లు ఏం చేసుకుంటారో అనే భయంతో నంబర్‌ కూడా మార్చేశాను. అయినా తనని మరిచిపోలేక, మా వాళ్లకి ఇచ్చినమాట తప్పలేక సతమతమౌతున్నా. తన క్యారెక్టర్‌ మంచిదా చెడ్డదా ఎలా తెలుసుకోవాలో తెలియక పిచ్చోడ్ని అవుతున్నా అన్నయ్యా. ప్లీజ్‌ మంచి సలహా ఇవ్వండి.
– సాకేత్‌

ఈ ఉత్తరం ఆ అమ్మాయి రాసుంటే ఎంత బాగుండేదో నీలాంబరీ‘సార్‌ రాసినోళ్లను కాదని రాయినోళ్లను పట్టుకుంటున్నారా?’నిజంగా ఆ అమ్మాయి రాసుంటే బాగుండేది నీలూ‘పోనీ ఇదే విషయం అమ్మాయి రాసుంటే ఏం చెప్పేవారు సార్‌?’మరచిపో రా చెల్లెలా...ఒరిజినల్‌ కాదీ లవ్వర్‌..!శుద్ధ డూప్లికేట్‌ కేటు రా..అందరి మాటా వింటాడు..!సొంత మైన్డ్‌ లేనే లేదు..లవ్లో ఉంటే ఒట్టి తంటరా...!చేసుకుంటే పెంటరా..!లైఫ్‌ మొత్తం మెంటల్‌ రా..మరచిపో రా చెల్లెలా...!‘అంతేనంటారా సార్‌? వీళ్ల మాట వాళ్ల మాట విని.. ఎప్పుడూ టార్చర్‌ పెడతాడా సార్‌ సాకేత్‌?’ అలా అని చెప్పలేము కానీ ప్రస్తుతమైతే సాకేత్‌ కన్ఫ్యూజన్‌లో ఉన్నాడు. ప్రేమకు కారణాలుండవు. ప్రేమ ఇచ్చుడు, పుచ్చుడు ఉండదు. ప్రేమ పుట్టుడే ఉంటుంది. ఇట్‌ హ్యాపెన్స్‌. సాకేత్‌ది ప్రేమ కాదేమో. అందుకనే ఎవరు ఏది చెప్పినా ఇన్ఫూలెన్స్‌ అవుతున్నాడు. కొంచెం టైమ్‌ తీసుకుని... కరెక్ట్‌ డెసీషన్‌ తీసుకోవడం బెటర్‌...!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,  రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.lovedoctorram@sakshi.com

Advertisement
 
Advertisement
Advertisement