నన్నడగొద్దు ప్లీజ్‌  | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Apr 10 2018 12:17 AM | Updated on Apr 10 2018 12:17 AM

love doctor solve the problems - Sakshi

హాయ్‌ అన్నయ్యా..! నేనొక అమ్మాయిని లవ్‌ చేస్తున్నా. తనను ఆల్‌రెడీ  డైవోర్స్‌ తీసుకున్న అమ్మాయి. తనంటే నాకిష్టం. నేనంటే తనకీ ఇష్టం. పేరెంట్స్‌ కూడా అనుకూలంగానే ఉన్నారు. కానీ నా దగ్గర నుంచే సరైన క్లారిటీ లేదు. ఒకసారి ‘నువ్వంటే ఇష్టం కానీ ప్రేమలేదు’ అంటాను. ఒకసారి ‘ఉంది’ అంటాను. తను నా పిచ్చిని భరించలేక... ‘నువ్వు బాగా ఆలోచించి.. నాకో క్లారిటీ ఇవ్వు. నీకోసం వెయిట్‌ చేస్తా, లేదంటే వేరే పెళ్లి చేసుకుంటా’ అని అంటోంది. అలా అని తనని వదులుకోలేకపోతున్నా. ప్లీజ్‌ అన్నయ్యా నాకో క్లారిటీ ఇవ్వండి. – వినయ్‌
ఇవాళ మంచి రోజు కాదు వినయ్‌ జీ....!‘ఆన్సర్‌ చెప్పడానికి మంచిరోజు, చెడ్డరోజు ఉంటాయా సార్‌..? మీరు మరీ దినఫలాలు చూసి ఆన్సర్‌ చెప్పేలా ఉన్నారు. ఇట్లా అయితే మన దుకాణం బంద్‌ చేసుకోక తప్పదు సార్‌!’నిజంగా.. నాట్‌ ఏ గుడ్‌ డే నీలాంబరీ...!‘వినయ్‌కి వినయం ఉంది కాబట్టి మీ మూడ్‌ స్వింగ్‌ని భరిస్తున్నాడు కానీ అదే నేనైతేనా...!’అది కాదు...... నీలాంబరీ.....!‘ఏది కాదు సార్‌..? పాపం లవర్స్‌ మిమ్మల్ని నమ్మి రాస్తున్నారన్న పొగరు కాకపోతే మీరలా చేస్తారా సార్‌? మూడ్‌ బాగోలేదని, మూఢం బాగోలేదని ఎగతాళి చేస్తారా సార్‌!?’ఇదే విషయం ఆ వినయం ఉన్న వినయ్‌కి చెప్పరాదు?

పాపం డైవోర్స్‌ అయ్యి ఒక కష్టమైన మెంటల్‌ స్టేజ్‌లో ఉన్న అమ్మాయికి, ఒకరోజు లవ్వని, ఇంకోరోజు కాదని... మూడొచ్చినప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా మాటలు చెప్పి నా బంగారు తల్లి లైఫ్‌తోఆడుకుంటే.. ఎలా భరించమంటావు నీలూ..? నువ్వూ ఒక అమ్మాయివే కదా..?‘ఏంటి సార్‌ డౌటా??’అలా అనలేదు నీలూ. నువ్వు సూపర్‌ బ్యూటిఫుల్, సూపర్‌ స్మార్ట్, సూపర్‌ డూపర్‌ లవ్లీ గర్ల్‌ అని నాకేంటి... లవర్స్‌ అందరికీ తెలుసు..!! కానీ ఆ బంగారంతో వినయ్‌ అలా ఆడుకోవడం తప్పనిపించలేదా నీలూ?‘ఓ.. మీరు ఆ రూట్‌లో వచ్చారా..? వినయ్‌ బి ఏ గుడ్‌ బాయ్‌. ఫస్ట్‌ నిన్ను బిలీవ్‌ చెయ్యి. ఆ తర్వాత నీ లవ్‌ ని ట్రస్ట్‌ చెయ్యి. అమ్మాయికి క్లియర్‌ ఆన్సర్‌ ఇయ్యి.’అంతే కాదు నా బంగారాన్ని చులకన చెయ్యొద్దు.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌ 

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,  రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.lovedoctorram@sakshi.com

Advertisement
 
Advertisement
Advertisement