నన్నడగొద్దు ప్లీజ్‌  | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Apr 6 2018 12:09 AM | Updated on Apr 6 2018 12:09 AM

love doctor solve the problems - Sakshi

హాయ్‌ సార్‌..! నేనొక అమ్మాయిని ఐదేళ్లుగా లవ్‌ చేస్తున్నా. తనకీ నేనంటే ఇష్టం. కానీ ఏ రోజూ ఒకరికొకరం ప్రపోజ్‌ చేసుకోలేదు. ప్రాణ స్నేహితుల్లా ఉండేవాళ్లం. తనకి రీసెంట్‌గా పెళ్లి అయింది. అయినా నాకు తనంటే చాలా ఇష్టం. తనని మరిచిపోలేకపోతున్నా. తను మాత్రం ‘‘మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉందాం, వేరే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు’’ అంటోంది. నాకు ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. నా మైండ్‌ కూడా వర్క్‌ చెయ్యడంలేదు. ప్లీజ్‌ హెల్ప్‌ చెయ్యండి సార్‌. – శ్రీనివాస్‌
శ్రీనన్నా... అంతగా ఫీల్‌ అవ్వద్దు బ్రో...‘అక్కడ గుండె తరుక్కుపోతుంటే... ఫీల్‌ అవ్వద్దు అంటారేంటి సార్‌?’ట్రెయిన్‌ వెళ్లాక ప్లాట్‌ఫార్మ్‌కి వచ్చి జంపింగ్‌ చేస్తే స్టేషన్‌ మాస్టర్‌ ఏం చేస్తాడు నీలూ?‘సార్‌ తప్పించుకోవడానికి ట్రెయిను, బస్సు అని కథలు చెప్పకండి. అక్కడ శ్రీను మైండ్‌ పని చెయ్యడంలేదు. హార్ట్‌ పెయిన్‌గా ఉంది. స్టమక్‌లో ఫుడ్‌ ఉండటం లేదు. స్ట్రెస్‌ ఎక్కువై జుట్టు కూడా రాలిపోతోంది. బాడీఅంతా షేక్‌ అవుతోంది. జ్యూస్‌ తాగితే వాటర్‌ లాగా అనిపిస్తోంది. నీళ్లు తాగితే మత్తెక్కుతోంది.’నీలూ...! నీలూ...! నీలూ...............!‘ఏంటి సార్‌ అంతగా కేకపెట్టారు??’జుట్టూడిపోతుంది. బాడీ షేక్‌ అవుతుంది. జ్యూసు వాటరూ.. వాటర్‌ విస్కీలా ఉందని శ్రీను రాయకుండా నీకెలా తెలిసింది నీలూ?‘హత విధి! మీకేం తెలుసు సార్‌ లవ్వంటే? ఒట్టి బండరాయి సార్‌ మీరు.

గుండెలేనివారు మీరు. ఇంకొకరి బాధను అర్థం చేసుకోని వారు. మీరేంటి సార్‌ ఇంకొకరి లవ్‌ని అర్థం చేసుకునేది. ఛస్‌...స్‌..స్‌....! లవ్‌ బ్రేక్‌ అయితే... షేకులుంటాయి సార్‌. పాపం శ్రీను లవ్‌ మిస్‌ అయిపోయి, అలా అయిపోయి ఉంటాడని లవ్వు తెలిసిన నా అంచనా సార్‌!’అదీ సంగతి శ్రీను.! అమ్మాయిలకేమీ జుట్టు ఊడటంలేదు. బాడీ షేక్‌ లేదు. జ్యూస్‌ వాటర్‌లా అనిపించడంలేదు. వాటర్‌ వాటర్‌ లాగే అనిపిస్తుంది. పెళ్లి చేసుకుని చక్కగా కాపురం చేసుకుంటోంది. నువ్వంటే ఇష్టం కాబట్టి... నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటోంది. నెక్ట్స్‌ టైమ్‌ ప్లాట్‌ఫార్మ్‌కి టైమ్‌కి వెళ్లమంటోంది.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement