నన్నడగొద్దు ప్లీజ్‌ 

love doctor solve the problems - Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ అన్నయ్యా..! నేనొక అమ్మాయిని లవ్‌ చేస్తున్నా. ఇంకా తనకి ప్రపోజ్‌ చెయ్యలేదు. అయితే ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడట. ఆరాతీస్తే ఆ అబ్బాయంత మంచివాడు కాదని తెలిసింది. పైగా తనకంటే నైన్‌ ఇయర్స్‌ పెద్దవాడట. ‘ఆ అబ్బాయి కంటే నువ్వే చాలా బెస్ట్‌’ అని నా ఫ్రెండ్స్‌తో పాటు ఆ అమ్మాయి క్లోజ్‌ ఫ్రెండ్స్‌ కూడా అంటున్నారు. మా అమ్మకి ఈ విషయం చెబితే.. ‘ముందు కెరీర్‌పై దృష్టి పెట్టు, ఇవన్నీ తర్వాత చూద్దాం’ అన్నారు. నేను మాత్రం ఆ అమ్మాయిని మరిచిపోలేకపోతున్నా. మంచి సలహా ఇవ్వండి ప్లీజ్‌. – జయంత్‌

సేమ్‌ టు సేమ్‌.‘ఏంటి సార్‌ సేమ్‌ టు సేమ్‌????’నీలాంబరి, సేమ్‌ టు సేమ్‌... నీలాంబరి!‘ఏంటి సార్‌ సేమ్‌ టు సేమ్‌????’చెప్పాను కదా సేమ్‌ టు సేమని!‘మీకు దండం పెడతాను. జయంత్‌ టెన్షన్‌ భరించలేకపోతున్నాడు. నేను కూడా టెన్షన్‌ తట్టుకోలేకపోతున్నాను సార్‌. సేమ్‌ టు సేమ్‌ ఏంటి సార్‌?’ఆ రెండో అబ్బాయి ఉన్నాడు కదా...‘వాడెవడు సార్‌?’అదే జయంత్‌ ఇష్టపడే అమ్మాయి ఇష్టపడే అబ్బాయి.....‘సార్‌.. తల తిరుగుతుంది సార్‌!’సేమ్‌ టు సేమ్‌ నీలాంబరి!‘మళ్లీ ఏంటి సార్‌ సేమ్‌ టు సేమ్‌!’నాకు కూడా గిర్రున తిరుగుతుంది నీలాంబరి!‘మీకెందుకు తిరిగింది మహాప్రభో!!?!!’సేమ్‌ టు సేమ్‌ చూసి నీలాంబరి!‘సార్‌ కరెక్ట్‌గా చెప్పండి. అర్థమయ్యేలా చెప్పండి. తికమక పెట్టకుండా చెప్పండి. తల తిరగకుండా చెప్పండి. సేమ్‌ టు సేమ్‌ అనకుండా చెప్పండి.

లేకపోతే వన్‌ వీక్‌ నో అరటిపండు!’ఆ అబ్బాయి కూడా సేమ్‌ టు సేమ్‌ లెటర్‌ రాశాడు నీలాంబరి. ‘‘జయంత్‌ వట్టి వేస్ట్‌గాడు... నేను సూపర్‌.. అని ఫ్రెండ్సంతా అంటున్నారు, మేమే జోడీ నంబర్‌ వన్‌ అని లోకమంతా కోడై కూస్తుంది’’అనిరాశాడు. ‘సార్‌ అర్థమైంది సార్‌..! జయంత్‌ తన గురించి తాను చెప్పుకుంటే... ఆ అబ్బాయి తన గురించి తాను చెప్పుకోడా అని కదా సార్‌ మీరు పీకుతున్న క్లాస్‌?’కరెక్ట్‌..! వీళ్లు... వీళ్లు.. సొంత డబ్బా కొట్టుకోవడమేనా? అమ్మాయి అభిప్రాయానికి విలువ లేదా అని అడుగుతున్నా...!‘అవును సార్‌..! నేను కూడా జయంత్‌ని సేమ్‌ టు సేమ్‌ అడుగుతున్నా సార్‌!!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌ 
lovedoctorram@sakshi.com

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top