నన్నడగొద్దు ప్లీజ్‌ 

love doctor solve the problems - Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సార్‌..! నేనొక అమ్మాయిని ఫోర్‌ ఇయర్స్‌గా లవ్‌ చేస్తున్నా. తను కూడా నన్ను లవ్‌ చేస్తోంది. వాళ్ల అమ్మ నాకు మేనత్త అవుతుంది. రీసెంట్‌గా వాళ్ల చిన్నన్న నన్ను కలిసి మాట్లాడాడు. ‘‘మా చెల్లిని లవ్‌ చేస్తున్నావా?’’ అని అడిగాడు. ‘‘అవును’’ అని చెప్పాను. దాంతో ‘‘నువ్వు ఎస్సై జాబ్‌ తెచ్చుకో, నేను మా డాడీని ఒప్పిస్తాను’’ అన్నాడు. వాళ్ల మదర్‌ కూడా అదే చెప్పారు. నేను సరే అన్నాను. అయితే వాళ్ల అన్నయ్య నాతో మాట్లాడిన నాటి నుంచి, ఆ అమ్మాయి నాతో మాట్లాడటం మానేసింది. ఏం జరుగుతుందోనని భయంగా ఉంది సార్‌. ఏదైనా సలహా ఇవ్వండి ప్లీజ్‌. – బిట్టు
జాబ్‌ తెచ్చుకో...‘అదేమైనా బజారులో దొరుకుతుందా సార్‌?’తెచ్చుకోక తప్పదు.‘అదేమైనా అరటిపండా సార్‌? తప్పదు అంటే తెచ్చుకోవడానికి...???!’అమ్మాయిని మరిచిపో...‘సార్‌...! అసలు మీకు హార్ట్‌ ఉందా సార్‌? ఒక లవర్ని పట్టుకుని అమ్మాయిని మరిచిపొమ్మనడానికి మీకు మనసు ఎలా వచ్చింది సార్‌????’బిట్టు ఒప్పుకున్నాడుగా జాబ్‌ తెచ్చుకుంటానని...!‘ఏదో అమ్మాయి బ్రదర్‌ ప్రెజర్‌ తట్టుకోలేక అలా చెప్పాడు సార్‌. ఇప్పటికిప్పుడు జాబ్‌ తెచ్చుకోవాలంటే ఎలా సార్‌???’బిట్టు వాళ్ల అత్త.. అమ్మాయి బ్రో.. ఏం కావాలో చెప్పారు కానీ అమ్మాయి సైలెంట్‌ అయిపోయిందంటే... రీజన్‌ ఏంటి చెప్పు నీలూ?‘ఏమో సార్‌ మీరు త్రిలోకజ్ఞానులు. మీరే చెప్పండి..!’అమ్మాయి మాట్లాడటం మానేసిందంటే తనకి కూడా ‘పోలీస్‌!’ జాబ్‌ ఉన్న బిట్టూనే కావాలి. సో బిట్టు తెచ్చుకుంటాడు జాబు. ఒప్పుకుంటుంది జానూ.‘ఆ తర్వాత ఇద్దరూ పాడుకుంటారు డ్యూయెట్‌ గాన...! కదా సార్‌?’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయంమిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top