నన్నడగొద్దు ప్లీజ్‌  | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Mar 27 2018 12:19 AM | Updated on Mar 27 2018 12:19 AM

love doctor solve the problems - Sakshi

హాయ్‌ సార్‌..! నేను ఒక అబ్బాయిని ఎనిమిదేళ్లుగా లవ్‌ చేస్తున్నాను. నా నైన్త్‌ క్లాస్‌ నుంచి తనంటే నాకు చాలా ఇష్టం. తనకీ నేనంటే ప్రాణం. నేను ఏ తప్పు చేసినా నన్ను క్షమించేవాడు. తను నాకు దొరకడం గాడ్స్‌ గిఫ్ట్‌ అనుకున్నా. కానీ మా ఇంట్లో మా లవ్‌ మేటర్‌ తెలిసి, ‘‘వాళ్ల కులం వేరు, ఇవన్నీ కుదరవు. మరిచిపో’’ అన్నారు. తనని బాగా కొట్టి పోలీస్‌ కేసు పెట్టారు. అంత జరిగినా ‘‘నువ్వే కావాలి’’ అనేవాడు. కానీ ‘‘మేం చస్తాం లేదా తనని చంపేస్తాం’’ అని అన్నయ్యలు బెదిరించారు. అందరూ కలిసి నాకు బలవంతంగా పెళ్లి చేశారు. ఇప్పుడు నేను చేసుకున్న అబ్బాయి అంటే నాకు ఇష్టంలేదు. నేనంటే ఆ అబ్బాయికీ ఇష్టంలేదు. ఏదో ఫ్యామిలీ కోసం కలిసి ఉన్నామంతే. నేను నా ఫ్యామిలీతో మాట్లాడటం కూడా మానేశాను. ఇప్పటికీ నేను ప్రేమించిన అబ్బాయితోనే జీవించాలనిపిస్తోంది. తను కూడా నన్నే కోరుకుంటున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి సార్‌. మంచి సలహా ఇవ్వండి ప్లీజ్‌. – జ్యోతి
మొదటిసారి అమ్మానాన్న అన్నయ్యలు ఒప్పుకోనప్పుడూ...అబ్బాయి మీద దాడి చేసినప్పుడూ...సమాజం సహాయం తీసుకోవాల్సింది.పోలీసులతో మాట్లాడాల్సింది.అమ్మానాన్నలకు అన్నయ్యలకు అర్థమయ్యేలా పెద్దవాళ్లతో చెప్పించాల్సింది.‘సార్‌ అవన్నీ పాస్ట్‌ సార్‌.. పాపం జ్యోతి ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి సార్‌..!’పెళ్లి చేసుకున్నాక ఉన్నవి రెండే మార్గాలు. ఒకటి సర్దుకుపోయి సంతోషం వెతుక్కోవడం...రెండవది పెళ్లి నుంచి లీగల్‌గా బయటపడ్డం.‘అమ్మో... పాపం సార్‌.. రెండూ కఠినమైన మార్గాలే సార్‌.. మరెలా..? ఇప్పుడెలా????’ఏ నోన్‌ డెవిల్‌ ఈజ్‌ బెటర్‌ దెన్‌ ఏ అన్‌నోన్‌ ఏంజెల్‌..
‘సార్‌... తెలుగులో చెప్పండి సార్‌... మాకు కన్ఫ్యూజన్‌ వచ్చినప్పుడల్లా మీరు ఇంగ్లిష్‌లో పీకితే ఎలా సార్‌ అర్థం చేసుకోవడం!?!’తెలియని లవర్‌ కంటే తెలిసిన భర్తే నయం అని చెబుతున్నా నీలూ.‘లవర్‌ తెలియకపోవడం ఏంటి సార్‌???’లవర్‌ లవర్‌గా తెలియచ్చు కానీ భర్తగా ఎలా ఉంటాడో మనకేం తెలుసు నీలూ? దూరపు కొండలు నునుపే కదా..?‘జ్యోతి బంగారం.. మీ అన్నయ్య చెబుతున్న సూక్ష్మం ఏంటంటే మ్యారేజ్‌లో హ్యాపీనెస్‌ క్రియేట్‌ చేసుకోమని. ప్రతి మ్యారేజ్‌లో హ్యాపీనెస్‌ ఉండదు. మనం అనుకుంటే ఏ మ్యారేజ్‌ అయినా బ్యూటిఫుల్‌గా చేసుకోగలం. ఆల్‌ ది బెస్ట్‌ జ్యోతి!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,  రోడ్‌ నంబర్‌ 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement