నన్నడగొద్దు ప్లీజ్‌  | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Mar 23 2018 12:14 AM | Updated on Mar 23 2018 12:14 AM

love doctor solve the problems - Sakshi

హాయ్‌ అన్నయ్యా..! నేను సాయి అనే అబ్బాయిని లవ్‌ చేస్తున్నా. తను నాకంటే టూ ఇయర్స్‌ పెద్దవాడు. మొదట తనే ప్రపోజ్‌ చేశాడు. నేనంటే తనకి ప్రాణం. నాకోసం ఏమైనా చేస్తాడు. తనంటే నాకు చాలా ఇష్టం. కానీ మా నేపథ్యాలు వేరు. చిన్నప్పుడే మా డాడీ చనిపోయారు. మా మమ్మీ నన్ను చాలా కష్టపడి పెంచింది. ఆమెకు చెప్పకుండా నేను ఏ పనీ చేయను. అందుకే మా లవ్‌ మేటర్‌ మా మమ్మీకి చెప్పేశాను. మొదట్లో బాగా భయపడింది. కానీ సాయి నా మీద చూపించే కేరింగ్‌ చూశాక చాలా సంతోషించింది. కానీ ఇప్పుడు.. సాయి వాళ్ల పేరెంట్స్‌ మమ్మల్ని విడగొడతారేమోనని భయంగా ఉంది. అదే మాట సాయితో అంటే... ‘అలా ఏం కాదు’ అంటున్నాడు. ‘ఆ అమ్మాయిని వదిలెయ్యకపోతే.. మేం చచ్చిపోతాం’ అని వాళ్ల పేరెంట్స్‌ భయపెడితే పరిస్థితి ఏంటి అన్నయ్యా? సాయి లేకపోతే నేను బతకలేను. ఈ ఆలోచనలతో నిద్ర కూడా పట్టడం లేదు. సాయి మాత్రం ‘అలా ఏం కాదు’ అంటున్నాడు కానీ, ఒకవేళ అలానే జరిగితే ఏం చేస్తాడో చెప్పడంలేదు. చాలా భయమేస్తోంది అన్నయ్యా. మంచి సలహా ఇవ్వండి ప్లీజ్‌. – సౌమ్య
నీ పేరే సౌమ్య.సౌమ్యంగా ఉండు. వినయం.. సౌందర్యం.. ఉన్న నా బంగారు చెల్లెలివి.‘సార్, అమ్మాయిని చూడకుండానే.. పేరు చూసి, ఓ కోతలు కోస్తున్నారేంటి సార్‌?’నీలూ.... నీకు బాహ్య సౌందర్యం ఒక్కటే కనబడుతుందా...?‘సార్‌ తెలుగులో మాట్లాడండి. బా.. హా.. యా.. సౌ.. అం.. దర్‌.. యం.. అని పెద్ద పెద్ద తెలుగు పదాలు వాడి లవర్స్‌ని కన్ఫ్యూజ్‌ చేస్తున్నారెందుకు సార్‌?’నీకర్థమైందా నీలూ..?‘ఎస్‌.. నాకు తెలుసు సార్, బాహ్య సౌందర్యమంటే ఔట్‌సైడ్‌ బ్యూటీ. అంటే మనసుకు ఉన్న అందాన్ని గమనించకపోవడం. అర్థం చేసుకోకపోవడం. సౌమ్యమును మించిన అందం ఉండదు. దాన్ని మించిన మంచి మనసు ఉండదు. ఇదంతా మన లవ్‌ డాక్టర్‌... డిగ్రీ లేని మన లవ్‌ డాక్టర్‌.. అమ్మాయి మాటల్లో పసిగట్టి, మన దగ్గర మార్కులు కొట్టేస్తున్నారు. కదా సార్‌?’అబ్బా..! యు ఆర్‌ వెరీ స్మార్ట్‌ నీలాంబరి. సౌమ్య..! నీలోని అందాన్ని చూసి ప్రేమించిన వాడు.. నిన్ను ఎప్పటికీ మోసం చేయడు. నిన్ను పోగొట్టుకుంటే, లైఫ్లో బిగ్గెస్ట్‌ మిస్టేక్‌ చేసిన వాడవుతాడు. సో బీ బ్రేవ్‌..!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement