నన్నడగొద్దు ప్లీజ్‌  | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Mar 22 2018 12:41 AM | Updated on Mar 22 2018 12:41 AM

love doctor solve the problems - Sakshi

హాయ్‌ అన్నయ్యా..! నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తను కూడా నన్ను ప్రేమిస్తోంది. ఫస్ట్‌ తను ఒక అబ్బాయిని ప్రేమించిందట. వాళ్లు బ్రేకప్‌ అయ్యారు. ఆమె వేరే అతణ్ని లవ్‌ చేసిన విషయం నాకు తెలిసి కూడా ప్రేమించాను. మేము ప్రేమించుకుంటున్న విషయం మా ఇంట్లో తెలిసింది. తనది మా అమ్మమ్మ వాళ్ల ఊరు. మా ఫ్యామిలీ మొత్తం తను మంచిది కాదని, తనను వదిలేయమని చెబుతున్నారు. మా అమ్మమ్మ వాళ్ల పక్కింటి ఆవిడ కూడా చెబుతోంది తన క్యారెక్టర్‌ బ్యాడ్‌ అని. కానీ నేను నమ్మలేదు. మళ్లీ ఫోన్‌ చేయడం మొదలుపెట్టాను. ఆ విషయం మా ఇంట్లో తెలిసి, ఆమెతో మాట్లాడితే చనిపోతామంటున్నారు. తనేమో నా కోసం ఎన్ని రోజులైనా వెయిట్‌ చేస్తానంటోంది. తనను వదులుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను. ఫోన్‌ నంబర్‌ కూడా మార్చేశాను. తనను మర్చిపోలేక, మా వాళ్లకు ఇచ్చిన మాట తప్పలేక సతమతమవుతున్నాను. తన క్యారెక్టర్‌ మంచిదా కాదా అని ఎలా తెలుసుకోవాలో తెలియడం లేదు. అన్నయ్యా..! మంచి సలహా ఇవ్వండి.
– సాకేత్‌

సాకేత్‌ నువ్వు పక్కా.....‘సార్‌ మెచ్చుకోబోతున్నారా? తిట్టబోతున్నారా సార్‌..!?.. అంత ఆవేశంగా అన్నారంటే ఏదో ప్రాబ్లమ్‌ అని నాకు అనిపించింది సార్‌. మీరు రీసెంట్‌గా అందర్నీ తిడుతున్నారు సార్‌. ఏదో సరదాగా ఆన్సర్లు ఇస్తూ మన అరటిపండు మనం సేవిస్తూ ఎంజాయ్‌ చేయాల్సింది పోయి మీరు కసా..బిసా.. కర్రుమ్‌.. గిర్రుమ్‌ అంటూ పళ్లు కొరుక్కుంటూ ఆన్సర్లిస్తే మొదటికే మోసం వస్తుంది సార్‌. కొంచెం కూల్‌.. కూల్‌ సార్‌..!’సాకేత్‌ నువ్వు పక్కా.....‘ఏంటి సార్‌ ఎంత మొత్తుకున్నా...’సాకేత్, యు ఆర్‌ మ్యాడ్‌. అమ్మాయి క్యారెక్టర్‌ గురించి మాట్లాడతావా? ఏం.. నువ్వు ఎవరినైనా ప్రేమించి, వర్కౌట్‌ కాక మళ్లీ ప్రేమలో పడితే నీ క్యారెక్టర్‌ బ్యాడా??? పక్కింటోళ్లు, ఎదురింటోళ్లు.. నీ బంధువులు అమ్మాయిని బ్యాడ్‌ చేస్తుంటే నువ్వెలా ఒప్పుకున్నావ్‌. అయినా నీకు ముందే తెలుసు అమ్మాయి ఓసారి లవ్లో దెబ్బతిన్నదని. నువ్వు ఒళ్లు మరచి అమ్మాయిని ప్రేమించి, ఇప్పుడు బ్యాడ్‌గా మాట్లాడతావా? ఖబర్దార్‌ అమ్మాయిని అలా అంటే...! నీకిష్టం లేకపోతే మానెయ్యి, వదిలెయ్యి.. సన్యాసం పుచ్చుకో. అయినా బాయిస్‌కి అలవాటే కదా, ఒక చోట వర్కౌట్‌ కాకపోతే ఇంకోచోట గాలం వెయ్యడం. వేసుకో..! ఎన్నిసార్లు ఫిషింగ్‌ చేసుకుంటావో చేసుకో..! అంతే కానీ, అమ్మాయి క్యారెక్టర్‌ గురించి నెవర్‌ సే ఎనీథింగ్‌..!!‘సార్‌... అరటి పండు తినండి. సాకేత్‌కి అర్థమైంది. హి ఈజ్‌ గుడ్‌ బాయ్‌. కూల్‌ సార్‌.. కూల్‌..!!’
 - ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement
 
Advertisement
Advertisement