నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Mar 7 2018 3:46 AM | Updated on Mar 7 2018 3:46 AM

love doctor solve the problems - Sakshi

హాయ్‌ సార్‌...! నేను ఒక అమ్మాయిని నైన్‌ ఇయర్స్‌ ప్రేమించా. తను నన్ను లవ్‌ చేసిందో లేదో నాకు తెలీదు కానీ, నన్నే చూసేది. నాతో మాట్లాడేది కూడా. కానీ కొన్నాళ్లకి తనకి పెళ్లి అయిపోయింది. నేనిప్పుడు మరో అమ్మాయిని లవ్‌ చేస్తున్నాను. తను కూడా నాతో బాగా మాట్లాడుతోంది. అయితే మొన్న మా ఇద్దరినీ ఆ మొదటి అమ్మాయి చూసి భయపడిందట. ఈ విషయం మా ఫ్రెండ్‌ చెప్పాడు. నేను ఇప్పుడు ఫస్ట్‌ అమ్మాయిని లవ్‌ చెయ్యాలా? లేక సెకండ్‌ అమ్మాయిని లవ్‌ చెయ్యాలా??
– వాసు

సెకెండ్‌ అమ్మాయిని నైన్‌ ఇయర్స్‌ లవ్‌ చెయ్యాలి.‘సార్‌ వాసు ముసలోడు అయిపోతాడు సార్‌!’సరే ఎయిట్‌ ఇయర్స్‌ చెయ్యమను చాలు.‘ఎందుకు సార్‌ డిస్కౌంట్‌ ఇచ్చారు?’యంగ్‌గా ఉంటాడని..!‘ఏంటి సార్‌ అంత వెటకారం? పాపం వాసు ఒక లవ్‌లో నైన్‌ ఇయర్స్‌ వేస్ట్‌ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ...........!’మరి ఏంటి నీలాంబరీ, నైన్‌ ఇయర్స్‌ లవ్‌ చేసిన అమ్మాయి వాసును ఇంకో అమ్మాయితో చూసి దడుచుకుందంటే దాని మీనింగ్‌ ఏంటి నీలూ....??‘ఏంటి సార్‌????’వీడు టెస్ట్‌ ప్లేయర్‌ నీలూ.. ఈ రోజుల్లో అంతా ట్వంటీ ట్వంటీ కదా, అందుకే దడుచుకుంది.‘వాసు తొందరగా లవ్వాడి.. తొందరగా పెళ్లి చేసుకో....!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,  రోడ్‌ నంబరు 1,  బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com

Advertisement
 
Advertisement
Advertisement