నన్నడగొద్దు ప్లీజ్‌  | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Mar 2 2018 5:56 AM | Updated on Mar 2 2018 5:56 AM

love doctor solve the problems - Sakshi

హాయ్‌ సార్‌..! నన్ను ఒక అమ్మాయి లవ్‌ చేస్తోంది. కానీ బయటపడటంలేదు. తన మనసులోని ఆ మాటలను, ఆ భావాలను ఎలా బయట పెట్టించాలి సార్‌? నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తోంది. తను నా సీనియర్‌ బట్‌ సేమ్‌ సెక్షన్‌. నా మీద తన ఇంటెన్షన్‌ ఏంటనేది తెలుసుకోవడం ఎలానో కాస్త  క్లియర్‌గా చెప్పండి సార్‌ ప్లీజ్‌. – యశ్వంత్‌
నీ సీనియర్‌ కదా? ‘అయితే ఏంటి సార్‌?’ సీనియర్‌ సేమ్‌ సెక్షన్‌ అంటే ఎలా?? ‘సెక్షన్‌ ఒకటే. కానీ క్లాస్‌ వేరు సార్‌...!!’ అంటే పెద్ద క్లాస్‌లో ఉన్న అమ్మాయా? మరి చిన్న క్లాస్‌లో ఉన్న అబ్బాయి
వెంటబడి తిరుగుతుంది అంటే ఏంటి?? ‘తనకు అర్థం కాక మీకు రాస్తే... మీరేంటి సార్‌ నాకు వేస్తున్నారు??’ మరి నేను చెప్పనా???‘నస పెట్టకుండా చెప్పండి సార్‌ ప్లీజ్‌!’చిన్న పిల్లోడు కదా. ముక్కు కారుతుందేమో తుడుద్దామని వెంట తిరుగుతుంది నీలూ..!!‘అంటే మదర్లీ ఫీలింగా సార్‌??’ ఎల్డర్‌ సిస్టర్‌ ఫీలింగ్‌ నీలూ!!
-ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,  రోడ్‌ నంబరు 1,  బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement
 
Advertisement
Advertisement