న న్నడగొద్దు ప్లీజ్‌ | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Feb 28 2018 12:39 AM | Updated on Feb 28 2018 12:39 AM

love doctor solve the problems - Sakshi

హాయ్‌ సార్‌..! నేను ఒక స్టూడెంట్‌ని. నా చిన్నప్పటి ఫ్రెండ్‌ అంటే నాకు చాలా ఇష్టం. టెన్త్‌ తరువాత ఇద్దరం విడిపోయాం. మళ్లీ గ్రాడ్యుయేషన్‌ టైమ్‌లో ఫేస్‌బుక్‌ ద్వారా దగ్గరయ్యాం. కొన్నాళ్లు చాటింగ్‌లు, కాల్స్‌ నడిచాయి. తను నన్ను చాలా మోటివేట్‌ చేసేది. నా పట్ల తన కేరింగ్‌ చూసి, తనంటే ఇష్టం మరింత పెరిగింది. చివరికి ఒకరోజు తన వాట్సాప్‌ స్టేటస్‌ చూసి, తను ఎవరినో ఇష్టపడుతోందని తెలిసింది. ఆ వ్యక్తి అంటే తనకు ఇంట్రెస్ట్‌ అని, తనతో చాలా హ్యాపీగా ఉంటానని చెప్పింది. దాంతో చాలా డిస్టర్బ్‌ అయ్యాను. దీన్ని నా మనసుకి ఎలా తీసుకోవాలో అర్థం కావడంలేదు. నాకు చాలా గోల్స్‌ ఉన్నాయి. ఈ విషయం తెలిసినప్పటి నుంచీ దేనిపైనా దృష్టి పెట్టలేకపోతున్నాను. మళ్లీ నేను నార్మల్‌ అవ్వాలంటే ఏం చెయ్యాలి?
– వాసు

అమ్మాయికి నిజం చెప్పెయ్యాలి. ‘ఎలా చెప్పాలి సార్‌?’ ఉత్తరం రాయాలి.. ‘పొండి సార్, ఉత్తరం ఏంటి? మెయిల్‌ పెట్టమందాం. ఏం రాయాలి సార్‌? మీరే రాయండి సార్, వాసు కటింగ్‌ పేస్టింగ్‌ చేసుకుంటాడు సార్‌!’ డియర్‌ ప్రియురాలా, నువ్వు ఒకడిని ప్రేమిస్తున్నావు. బాగా లవ్వేస్తున్నావు. విపరీతంగా హ్యాపీ అవుతున్నావు. కానీ నీకు ఒక విషయం చెప్పాలి. నేను నిన్ను ప్రేమించినంతగా ఏ లవర్‌ ప్రేమించలేడు. అది ఎలా అనుకుంటున్నావా? నువ్వు ఇంకొకరి ప్రేమలో సంతోషంగా ఉన్నావని నేను నీ సంతోషాన్ని సంతోషంగా సంతోషిస్తున్నాను చూడూ.. అది నిజమైన లవ్‌. నువ్వు అలాగే సంతోషంగా సంతోషిస్తూ ఉండు. నీ సంతోషాన్ని నేను ప్రేమిస్తూ సంతోషంగా ఉంటాను..! ఇట్లు, నీ స్కూల్‌ లవర్, వాసు. ‘సార్‌ ఎంత డీప్‌ లవ్‌ సార్‌ వాసుది. కటింగ్‌ పేస్టింగ్‌ చేస్తే అమ్మాయి గాలి మళ్లచ్చు సార్‌!’ అని నవ్వింది నీలాంబరి. 
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,  రోడ్‌ నంబరు 1,  బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement