నన్నడగొద్దు ప్లీజ్‌  | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Feb 21 2018 12:01 AM | Updated on Feb 21 2018 12:01 AM

love doctor solve the problems - Sakshi

హాయ్‌ అన్నయ్యా..! నేను ఒక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. తను కూడా నన్ను లవ్‌ చేస్తోంది. కానీ మా నేపథ్యాలు వేరు. పెళ్లి చేసుకుందామంటే తను చాలా భయపడుతోంది. మేమిద్దరం ఒకరిని విడిచి మరొకరం బతకలేం. ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. దీనికి మంచి సలహా ఇవ్వండి ప్లీజ్‌. – భాస్కర్‌
నువ్వు వెళ్లి అమ్మాయి మమ్మీడాడీతో ఒక సిట్టింగ్‌ వేసుకో.. ‘సిట్టింగ్‌ అంటే ఏంటి సార్‌???’ ముగ్గురు కలిసి కూర్చోవడం నీలాంబరి ‘సిట్టింగ్‌ కుదురుద్దా సార్‌???’ ప్యార్‌ కియాతో డర్నా క్యా? ‘అంటే ప్రేమించినందుకు వాళ్లింటికెళ్లి గోడ కుర్చీ వెయ్యమంటారా సార్‌?’ సిట్టింగ్‌ అంటే నీకు అలా అర్థమైందా నీలూ..?! ‘లేకపోతే ఏంటి సార్‌..? వాళ్ల అమ్మాయికి లైనేస్తున్నాడని తెలిస్తే సిట్టింగ్‌ ఎక్కడ సార్‌.. స్టాండింVŠ.. రన్నింగ్‌.. తన్నింగ్‌.. ఇరగ్గొట్టింగ్‌ తప్ప ఇంకేముండదు సార్‌.. మీరు అనవసరంగా అమాయకుడైన భాస్కరుణ్ని ట్రాప్‌లోకి పంపిస్తున్నారు సార్‌!!’ అలా ఎందుకు అనుకోవాలి నీలూ.. సిట్టింగ్‌ వేస్తేనే ఫిట్టింగ్‌ అవుతుంది. భాస్కరుడంటి అమాయకుణ్ని ఏ అత్తవారు వదులుకుంటారు చెప్పు. లెట్‌ హిం ట్రై. కావాలంటే నువ్వు కూడా తోడుగా వెళ్లు నీలూ...! ‘ప్రేమలో థార్డ్‌ పార్టీ ఉండకూడదు సార్‌!’ భలే చెప్పావు నీలూ, భాస్కర్‌...! నువ్వు ముందు వెళ్లి అంకుల్, ఆంటీతో సిట్టింగ్‌ వేసి ఫిట్టింగ్‌ చేసేయ్‌. ఆల్‌ ది బెస్ట్‌.

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1,  బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com 
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement