నన్నడగొద్దు ప్లీజ్‌  | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Jan 23 2018 1:11 AM | Updated on Jan 23 2018 1:30 AM

love doctor solve the problems - Sakshi

హాయ్‌ రామ్‌గారు. నా వయసు 26. నాకు ఒక అమ్మాయి ప్రపోజ్‌ చేసింది. నేను నో చెప్పాను. తను ఆత్మహత్యాయత్నం చేసింది. ఏంటీ పిచ్చిపని అంటే.. ‘‘నువ్వు నా జీవితం. నువ్వు లేకుండా నేను లేను’’ అంది. నేను నో చెప్పడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి.. మా అమ్మ అంటే నాకు ప్రాణం. అమ్మకి ఇంటర్‌ కాస్ట్‌ మ్యారేజ్‌లు ఇష్టం లేదు. రెండు.. నాకు తెలిసిన అబ్బాయి కూడా తనని లవ్‌ చేస్తున్నాడు. నేను తనని పెళ్లి చేసుకుంటే మిత్రద్రోహం అవుతుందని ఆలోచిస్తున్నా. కానీ ఆ అబ్బాయి మీద తనకి మంచి అభిప్రాయం లేదు. ఎస్‌ అని చెప్పాలని ఉంది. ఎందుకంటే నేను అందంగా ఉండను. అయినా నా మనసు చూసి ప్రేమించింది. అందుకే తనంటే ఇష్టం. నిజానికి అమ్మా, అమ్మాయి నాకు రెండు కళ్లు. ఇప్పుడు నేనేం చెయ్యాలి సలహా ఇవ్వండి ప్లీజ్‌.
– శేఖర్‌

బాగుండడం.. బాగోకపోవడం.. మన చేతుల్లో ఉండదు కదా శేఖరు..? అది దేవుడి సృష్టి. దేవుడికి నువ్వు చాలా అందమైన బిడ్డవు. అమ్మకు నువ్వు అందాల కన్నవు.నువ్వు అందంగా లేవని... ఇంకో అమ్మాయి దొరకదని... అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని... లవ్‌లోకి దూకద్దు..! కాళ్లు విరుగుతాయి...!! ‘వెటకారం చెయ్యకండి సార్‌.. ఆల్రెడీ ఫీల్‌ అవుతున్నాడు శేఖర్‌...!’ కాదు నీలాంబరీ, మనకిష్టం ఉన్న వాళ్లని ప్రేమించడంలో ఒక అర్ధం ఉంది..\ మనకు మనము నచ్చడం లేదని ప్రేమలో పడ్డం.. నాట్‌ రైట్‌! ‘మరేమి చెయ్యాలి సార్‌ శేఖర్‌..????’ నచ్చినమ్మాయిని అమ్మకు చూపించి... అమ్మకు నచ్చేలా నచ్చజెప్పి... హ్యాపీగా ఉండమను నీలూ...!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1,  బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement