నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor solve the problem | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Oct 19 2017 12:37 AM | Updated on Oct 19 2017 4:11 AM

love doctor solve the problem

హాయ్‌ అన్నయ్యా.. నేనొక అమ్మాయిని ప్రేమించాను. తన వయసు ప్రస్తుతం 17, నా వయసు 24. చచ్చేంత ఇష్టం నేనంటే. అయితే నన్ను ఇంకో అమ్మాయి లవ్‌ చేస్తోంది. తన వయసు 20. ఎఫ్‌బీలో పరిచయమయ్యింది. ఫస్ట్‌లో 20 ఇయర్స్‌ అమ్మాయి అంటే నాకూ ఇష్టమే. కానీ తను ఫ్రెండ్‌ అనడంతో... 17 ఇయర్స్‌ అమ్మాయిని లవ్‌ చేశాను. అయితే ఈ మధ్యే 20 ఇయర్స్‌ అమ్మాయి నాకు ప్రపోజ్‌ చేసింది. పైగా తనకి గవర్నమెంట్‌ జాబ్‌ కూడా వచ్చింది. ‘నువ్వు లేకపోతే చచ్చిపోతా’ అంటోంది. ఒకవేళ అంగీకరిస్తే తన జాబ్‌ కోసమే ఓకే చేసినట్లవుతుందని నా అంతరాత్మ చెబుతోంది. నేనేమో లైఫ్‌లో ఇంకా పూర్తిగా సెటిల్‌ కాలేదు. ఒక వేళ 17 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే.. ఇంకా త్రీ ఇయర్స్‌ వెయిట్‌ చెయ్యాలి. నాకేం ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు అన్నయ్యా. ప్లీజ్‌ సలహా ఇవ్వండి.
– రామ్‌

నాకేమీ అర్థం కాలేదు నీలాంబరీ!  మీకు అర్థం కాలేదా సార్‌!? ప్రాబ్లమ్‌ అర్థం కాలేదు! ‘కన్‌ఫ్యూజింగ్‌గా ఉందా సార్‌? చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది నీలూ..! ‘సార్‌ అసలు రామ్‌ అన్న పేరు పెట్టుకుంటే ఫస్ట్‌ అయ్యేది అదే సార్‌!’ ఏమవ్వుద్ది నీలూ..?\ ‘రామ్‌ అన్న పేరు పెట్టుకున్న వారంతా కన్‌ఫ్యూజింగ్‌ సార్‌!’ అంటే నన్ను అంటున్నావా నీలూ..? ‘ఛీ! ఏంటి సార్‌ మిమ్మల్నంటానా సార్‌!?’
రాసినోడిని అనకుండా రాముళ్లందరినీ అంటున్నావు కదా!? ‘నిజం చెప్పండి సార్‌ మీరు రాసేది ఎవరికయినా అర్థం అవుతుందా సార్‌? అవ్వదు సార్‌.. మీరంతా మేధావులు సార్‌!’ నా మాట ఎందుకులే రాసినోడు మేధావి అంటావా నీలూ? ‘లేకపోతే ఏంటి సార్‌ ఇద్దరినీ లైన్‌లో పెట్టాడు. ఒక అమ్మాయిని చిన్న పిల్లని చేసి ఆడుకుంటున్నాడు. ఇంకో అమ్మాయి పెద్ద ఉద్యోగం చూసి చొంగ కార్చుకుంటున్నాడు. మనోడేమైనా ప్రభాసా... మహేశా సార్‌!?’ కానీ క్యాష్‌ కోసం కాదు త్రీ ఇయర్స్‌ వెయిట్‌ చెయ్యలేక చేసుకుంటాను అంటున్నాడు. చిన్న అమ్మాయి ఇంకా ‘‘మిస్‌’’ అని... పెద్దమ్మాయి ‘‘మిస్‌ అయిపోతుందని...’’ కదా పాపం బిడ్డ గింజుకుంటున్నది!? ‘చెప్పాను కదా సార్‌ వాడికి బుద్ధి ఉంటే అమ్మాయి ఇంటిపేరు మార్చే ముందు తన పేరు మార్చుకోమని!’ నీకు రామ్‌ పేరంటే నచ్చదా నీలూ!? ‘ఆ పేరు పెట్టుకుని కొంటె పనులు చేస్తే చిర్రెత్తుద్ది సార్‌!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.  లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement