నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor solve the problem | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Oct 13 2017 11:41 PM | Updated on Dec 18 2017 12:31 PM

 love doctor solve the problem - Sakshi

హాయ్‌ అన్నయ్యా! నేను ఒక అమ్మాయిని తొమ్మిదేళ్లుగా లవ్‌ చేస్తున్నాను. తను కూడా నన్ను లవ్‌ చేసింది. కానీ, ఇప్పుడు ‘నువ్వు వద్దు’ అంటోంది. తనకి నేనంటే చాలా ఇష్టం. ఇప్పటిదాకా మా మధ్య చాలా గొడవలు వచ్చాయి కానీ, మేము అవన్నీ లైట్‌ తీసుకునేవాళ్లం. ఇప్పుడు వాళ్ల మమ్మీడాడీ ‘వాడిని పెళ్లి చేసుకుంటే చచ్చిపోతాం’ అంటున్నారట. దాంతో ‘నన్ను మరిచిపో’ అంటోంది. తను లేకపోతే నేను ఉండలేను. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. చెప్పు అన్నయ్యా నాకు తనే కావాలి.. నేనేం చెయ్యాలో చెప్పు ప్లీజ్‌!! – శివ శంకర్‌

అన్నా..! తొమ్మిదేళ్ల ప్రేమ.. సామాన్యమయిన ప్రేమ కాదు!! సడన్‌గా ఆగిపోతే గుండె ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది!! ప్రాణం పిండేసినట్టు అనిపిస్తుంది!! నైన్‌ ఇయర్స్‌ లవ్‌... గుప్పుమని ఊపిరి ఆపేసినట్లు అనిపిస్తుంది!! కన్నీళ్ల ఉప్పు మంటల్లా గొంతులో ఝుప్పుమంటుంటే.. గొంతు పెగలక.. మాట పలకక.. ప్రాణం తీసేసినట్టు అనిపిస్తుంది!! ఐ కెన్‌ అండర్‌స్టాండ్‌! ‘సార్‌ మీరు అండర్‌స్టాండ్‌ అయితే ఏమిటీ.. అప్పర్‌ స్టాండ్‌ అయితేనేమి? అక్కడ శివ శంకర్‌ ఈ బ్రేకప్‌ని విత్‌స్టాండ్‌ చెయ్యలేక పోతున్నాడు. మీ చెల్లెలు చేసిన మోసానికి ప్రిస్క్రిప్షన్‌ అడుగుతున్నాడు. అదేదో చూడండి సార్‌!’ ప్రిస్క్రిప్షన్‌ అయితే వంద రాసిస్తా.... ‘ఒక్కటి చాలు సార్‌.. ఇక్కడ ఉత్తరాల క్యూ ఉంది సార్‌!!’ ప్రిస్క్రిప్షన్‌ అయితే వంద రాసిస్తా.. అమ్మాయే కావాలంట..!!

‘రాసివ్వడానికి అమ్మాయి ఏమైనా బొమ్మా సార్‌? కావాలంటే రాసివ్వడానికి??!ః!’ బాగా చెప్పావు.. బాధైతే అర్థం చేసుకోగలం కానీ.. ధైర్యమైతే చెప్పగలం కానీ.. లవ్‌ అయితే చెయ్యగలం కానీ.. ‘అమ్మాయే కావాలంటే.. ఏమి చెయ్యాలి సార్‌?’ ఆలోచన మార్చాలి..! ప్రేమను నమ్మాలి!! కష్టాన్ని మింగాలి! లైఫ్‌లో కొత్త కిక్‌ తేవాలి!! న్యూ సక్సెస్‌ వెతకాలి..!! మీసం పెంచాలి! మీసం తిప్పాలి!! ‘సార్‌ ఎన్ని లవ్‌ ఫెయిల్యూర్లు సార్‌ మీవి...??? అంత మీసాలు పెంచారు...!?’ అని నవ్వింది నీలాంబరి!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement