నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor slove the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Nov 22 2017 12:19 AM | Updated on Nov 22 2017 12:19 AM

love doctor slove the problems - Sakshi

హాయ్‌ బ్రో! నేను, ఒక అమ్మాయి రెండేళ్లుగా చాలా డీప్‌గా లవ్‌ చేసుకుంటున్నాం. ఇద్దరం జాబ్‌ చేస్తున్నాం. తనకి పేరెంట్స్‌ లేరు. వాళ్ల అంకుల్‌ వాళ్లే పెంచారు. వాళ్లింట్లో మా మేటర్‌ చెబితే ఒప్పుకోవడం లేదు. దాంతో తను నన్ను వదులుకోవడానికి సిద్ధపడుతోంది. కానీ నేను వదులుకోలేకపోతున్నా. డైలీ కాల్‌ చేస్తున్నా. దాంతో నంబర్‌ మార్చేసింది. అయినా న్యూ నెంబర్‌ తెలుసుకున్నా. ఇద్దరం కలిసి ఎన్నో కలలు కన్నాం బ్రో. ఏదేమైనా కలిసే ఉంటామనుకున్నాం. తనకి పేరెంట్స్‌ అయినా హజ్‌బెండ్‌ అయినా నేనే కావాలనుకున్నా. ఇప్పుడు వాళ్లింట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని వేరే పెళ్లి చేసుకుంటుందట. ప్లీజ్‌ బ్రో గివ్‌ మీ సజెషన్‌. తను వేరే పెళ్లి చేసుకుంటే అదే నాకు లాస్ట్‌ డే అవుతుంది. ప్లీజ్‌ హెల్ప్‌ మీ బ్రో. – సతీష్‌
సతీష్‌ జీవితం ఎలాగూ ఏడిపిస్తుంది..! ప్రేమైనా నవ్విస్తే బాగుండు..! సంతోషంగా ఉండటానికి ప్రేమ ఉంది అనుకున్నాము...! అది కడుపులో తన్నుతుంది..! గుండెను చిదిమేస్తుంది..! ఊపిరి ఆడకుండా చేస్తుంది..! ఏంటో ప్రేమ గురించి కవులు.. ఎంతెంతో రాస్తుంటారు! పువ్వులా ఉంటుందనీ... సువాసనలు విరజల్లుతుందనీ.. చూడముచ్చటగా అనిపిస్తుందనీ... జీవితంలో రంగులు పూయిస్తుందనీ... ఏవేవో రాస్తారు..! ‘మరి ఇప్పుడేమయ్యింది సార్‌ ప్రేమకు..?!?’ పొల్యూషన్‌ అయ్యింది! కళ్లల్లో నీళ్లు కార్చే పొల్యూషన్‌..! ముక్కులు మండించే పొల్యూషన్‌..!! కడుపు తిప్పే పొల్యూషన్‌..!! వికారం అనిపించే పొల్యూషన్‌..!! ‘ఏంటి సార్‌ ఇవ్వాళ్ల ప్రేమను అంతగా తిడుతున్నారు..? మరీ.. సతీష్‌ చేసిన తప్పేంటి..?’ సిన్సియర్‌గా ప్రేమించాడు..! తల్లీ, తండ్రీ తానే అయ్యి చూసుకుంటానన్నాడు..! ప్రాణంకంటే ఎక్కువగా చూసుకుంటానన్నాడు...! ఏమైంది.. ఇలా ఎందుకు చేసింది? హృదయాన్ని ఎందుకలా చీరేసింది.. ప్రేమ!?! ‘పాపం చిన్నప్పటి నుంచి ఎవరూ లేకపోతే పెంచారు కదా సార్‌ ఇంట్లో వాళ్లు!

వాళ్లు చెప్పింది కాదని... వాళ్ల ప్రేమను కాదని.. వాళ్ల త్యాగాలను తొక్కుకుంటూ ఎలా వస్తుంది సార్‌ సతీష్‌ దగ్గరకు..? కొంచెం అర్థం చేసుకోవాలిగా సార్‌ సతీష్‌..! అంత మంచి వాడు ఈ కొంచెం అర్థం చేసుకోకపోతే ఎలా సార్‌...!?!’ప్రేమది తప్పు కాదంటావ్‌. సతీష్‌ ప్రేమ చాలా అందమైనదీ, గొప్పదీ అంటావ్‌. కానీ పరిస్థితులు అడ్డం పడ్డాయి అంటావ్‌. నిజమేనేమో సతీష్‌..!! ప్రేమించు.. గుండె నిండా ప్రేమించు!! అమ్మాయి చాలా గొప్పది.. నీ ప్రేమను ఎంతగా ప్రేమించినా ఇంట్లో వాళ్ల వాత్సల్యానికి కట్టుబడి ఉంది..!మీరిద్దరూ మేలిమి బంగారాలు. ధైర్యం పోగొట్టుకోవద్దు. గుడికెళ్లి దేవుడికి చెప్పిరా! తనూ నువ్వు ఇద్దరూ సంతోషంగా ఉండాలని దేవుడికి చెప్పిరా!! మీ లాంటి మంచి వాళ్లను దేవుడు ఇష్టపడతాడు. ఏది జరిగినా మీ మంచికే..! బ్లెస్‌ యు సతీష్‌!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement