నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor slove the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Nov 17 2017 11:53 PM | Updated on Nov 18 2017 2:28 AM

love doctor slove the problems - Sakshi - Sakshi

హాయ్‌ అన్నయ్యా..! నా ఇంటర్‌ ఎగ్జామ్స్‌ అయ్యాక ఫ్రీగా ఉన్న టైమ్‌లో ఎఫ్‌బి ఓపెన్‌ చేసి ఫ్రెండ్స్‌తో చాట్‌ చేసేదాన్ని. అలా నాకో అబ్బాయి పరిచయం అయ్యాడు. చాలా రోజులు చాట్‌ చేసుకున్నాం. ఒక రోజు ఐ లవ్యూ అని.. వెంటనే జోక్‌ అన్నాడు. నేను కూడా జోక్‌గా తీసుకున్నా. కానీ నేను తనని లవ్‌ చేస్తున్నానని ఎవరో తనకి మెసేజ్‌ చేసారట. ఆ మాట నమ్మి నన్ను అవాయిడ్‌ చేస్తున్నాడు. దాంతో చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నా. తన మాటలే నాకు బాగా గుర్తుకొస్తున్నాయి. చచ్చిపోదామని హ్యాండ్‌ కట్‌ చేసుకున్నా. అప్పుడు నాకు అర్థమైంది నిజంగానే తనని నేను లవ్‌ చేస్తున్నానని. కానీ తను నన్ను బాగా అవాయిడ్‌ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. పైగా తను మా కజిన్‌ అన్నయ్యకి ఫ్రెండట. అన్నయ్యేమో తనకి సబ్జెక్ట్స్‌ కూడా మిగిలిపోయాయి.. వాడో వేస్ట్‌ గాడు అని చెప్పాడు. నేనేమో ఫస్ట్‌ క్లాస్‌ స్టూడెంట్‌ని. ఇంటర్‌ బైపీసీలో 976/1000 మార్కులు వచ్చాయి. ప్లీజ్‌ అన్నయ్యా.. మీరు కూడా నా అన్నయ్యే కదా.. నాకు మంచి సొల్యూషన్‌ చెప్పండి ప్లీజ్‌. నాకు మాత్రం చచ్చిపోవాలని ఉంది.
– జ్యోత్స్న
ఎందుకురా బంగారం చచ్చిపోవడం? మనం తయారు చేసినదాన్ని దేన్నైనా మనం డెస్ట్రాయ్‌ చెయ్యొచ్చు! ‘ఏంటి సార్‌ కొత్త కథ చెబుతున్నారు..???’ అంతే కదా నీలూ..! హౌ కెన్‌ యు డెస్ట్రాయ్‌ వాట్‌ యు హేవ్‌ నాట్‌ క్రియేటెడ్‌? ‘సార్‌ మీకు మీసాలున్నాయి కదా అని... వాటిని తిప్పినట్లే ఆన్సర్స్‌ కూడా తిప్పి తిప్పి చెబితే ఏమి అర్థం అవుతుంది సార్‌?’ అంటే.. తిప్పిందేముంది దీంట్లో..? ‘సింపుల్‌గా చెప్పండి సార్‌!’ మనకు లైఫ్‌ ఇచ్చింది గాడ్‌ అండ్‌ పేరెంట్స్‌. అది మనది ఎట్లా అవుతుంది..? వాళ్లది..!! ‘దాన్నెట్లా డెస్ట్రాయ్‌ చేస్తావు అని అంటున్నారా!! సూపర్‌ సార్‌.. ఎలా డెస్ట్రాయ్‌ చేస్తావు జ్యోత్సా ్న..?’
కష్టం నీదైనా, నీ తెలివి నీది కాదు..! నీకు వారసత్వంగా వచ్చింది!! అంత మంచి మార్కులు తెచ్చుకున్న నీవు నీ తెలివిని నువ్వు ఎలా డెస్ట్రాయ్‌ చేస్తావు..??? ‘శహభాష్‌ సార్‌.. కానీ, లవ్వు, జివ్వు, గివ్వు అంతా మనం సృష్టించుకున్నదే కాబట్టి దాన్ని వదిలేసుకోవచ్చు అంటారా!?!’ అదీ అనడం లేదు. నువ్వు సృష్టించుకున్నది కూడా డెస్ట్రాయ్‌ చెయ్యొద్దు. కానీ అంత అమూల్యమైన నీ గొప్ప ప్రేమను ఎవరికి ఇస్తున్నావో అర్థం చేసుకుని అలాంటి ప్రేమను డెస్ట్రాయ్‌ చేసుకోవద్దు అంటున్నాను! ‘టర్‌.. టర్‌.. టర్‌.. టర్‌..!!’ ఏంటి నీలాంబరీ అలా ఈల వేశావు?? ‘అదిరింది సార్‌.. మన ప్రేమకు విలువ ఉండాలి.. దాన్ని ఎవరు పడితే వారి మీద వేస్ట్‌ చేసుకోకూడదు..! టర్‌.. టర్‌.. టర్‌.. టర్‌..!!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement