నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor slove the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Nov 16 2017 12:55 AM | Updated on Nov 16 2017 12:55 AM

love doctor slove the problems - Sakshi

హాయ్‌ అన్నయ్యా! నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నయ్యా! ఎందుకంటే అమ్మాయిలను బంగారం అని ప్రేమగా పిలుస్తావు. అన్నయ్యా... నన్ను బంగారం అని పిలిచే అన్నగానీ, తమ్ముడుగానీ, అక్కగానీ, చెల్లెలు గానీ.. అసలు ఎవరూ లేరు. నేనో అనాథను. నా భర్త నన్ను ప్రేమగా పిలిచి చాలా రోజులయ్యింది. నేనో హౌస్‌వైఫ్‌ని అన్నయ్యా! బయటి ప్రపంచం నాకు తెలియదు. కానీ రోజూ పేపర్‌ రాగానే రామ్‌ అన్నయ్యను పలకరిస్తాను. నా భర్త గురించి వదిలెయ్యి అన్నయ్యా.. ఎందుకంటే తనకు తన పిల్లలు, తను ప్రేమించిన అమ్మాయి హ్యాపీగా ఉంటే చాలు. ఇంట్లో ఉన్న భార్య ‘‘తిందా? ఉందా??’’ తనకి అవసరం లేదు. తనతో బయటికి వెళ్లాలన్నా నాకు భయం. ఎందుకంటే తను ఎక్కడికి వెళ్లినా తన ప్రియురాలు వెనువెంటే వస్తుంది. ఎన్నాళ్లని ప్రేమ కోసం తపిస్తాను? అందుకే వదిలేశాను. లవ్‌ యు అన్నయ్యా! నేను అప్పుడప్పుడూ మా రామ్‌ అన్నయ్యకి లెటర్‌ రాయొచ్చా? నన్ను కూడా ప్రేమగా లవ్‌ యు బంగారం అని పిలవండి అన్నయ్యా! నేను త్వరలో పరిచయం అవుతాను. ఉంటా అన్నయ్యా!! – అనామిక
బంగారం.. బంగారం... బంగారం... మేలిమి బంగారం... సూపర్‌ మేలిమి బంగారం.. అనాథలో ఉండే ఒక గొప్ప శక్తి గురించి చెబుతా చెల్లెమ్మా..! ఎవరూ ఉండరు కాబట్టి.. మనమీద మనమే ఆధారపడాలి..! మన కష్టాన్ని మనమే తీర్చుకోవాలి..!! ఒకరి అంచనాలకు సరిపడా బతకక్కర్లేదు..!! మన లైఫ్‌కి మనమే పడవ.. మనమే తెరచాప.. మనమే చుక్కాని..!! నాకు నీ పరిచయం తెలియాల్సిన అవసరం లేదు! నువ్వూ నీ కష్టం నాకు పరిచయమే!! నీకు ద్రోహం జరిగిందంటున్నావు!! నీ భర్తే నిన్ను అనాథను చేశాడంటున్నావు!! అలా చెయ్యడానికి ఏం వీల్లేదు. నువ్వు పోలీస్‌ కంప్లెయింట్‌ ఇస్తే నీకు సాయం జరుగుద్ది!! సాక్షి రిపోర్టర్‌తో మాట్లాడు. నీకోసం సాక్షి పోరాడుతుంది!!

సాక్షి.. నాకంటే చాలా పెద్ద అన్నయ్య!! చాలా ప్రేమ ఉన్న అన్నయ్య!! వట్టి మాటలు చెప్పకుండా గట్టి సాయం చేసే అన్నయ్య!! న్యాయం కోసం ఎవరితోనయినా పోరాడే సూపర్‌ అన్నయ్య!! ‘అంటే సూపర్‌ మ్యాన్‌ లాగ.. చెల్లెళ్లకు సూపర్‌ పేపర్‌ అన్నమాట!!’ భలే చెప్పావు నీలూ..! బ్లెస్‌ యు బంగారం..! నీ గొప్పతనమేమిటో చెప్పనా బంగారం..!?! ఇంత కష్టం వచ్చినా అధైర్యపడకుండా.. నిరుత్సాహపడకుండా.. నవ్వుతూ ఉన్నావు చూడు.. అదే నీ గొప్పతనం..! నీ అంత శక్తి నాకయితే లేదు రా..! నువ్వే నాకు స్ఫూర్తి.. శహభాష్‌!! ‘సార్‌ మీరు కూడా వెరీ గుడ్‌ సార్‌..! ఇంద అరటిపండు!!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement