నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor slove the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Oct 18 2017 12:55 AM | Updated on Oct 18 2017 12:55 AM

love doctor slove the problems

హాయ్‌ సర్‌! కృష్ణ అనే అబ్బాయిని నా ఫ్రెండ్‌ లవ్‌ చేసింది. వాడు మంచివాడు కాదని ఎంతమంది చెప్పినా వినలేదు. ఆ అబ్బాయికి పెళ్లయింది. అయినా సరే తనే కావాలనేది. కొన్ని రోజులు డల్‌గా ఉండేది. తరువాత ఇంకో అబ్బాయిని లవ్‌ చేసింది. ‘కృష్ణ నుంచి బయటికి రావడానికి ఇతడే కారణం’ అంటోంది. ఆ అబ్బాయి కూడా తనని అనుమానించలేదు. నా ఫ్రెండ్‌ని వాళ్ల పేరెంట్స్‌కి పరిచయం చేశాడు. వాళ్ల ఫ్యామిలీ అంతా నా ఫ్రెండ్‌ని బాగా చూసుకున్నారు. నా ఫ్రెండ్‌ కరెక్టేనా, మళ్లీ రాంగ్‌ రూట్‌లోకి వెళుతోందా? – సంధ్య

‘ఎలా తెలుస్తుంది సార్‌ మీకు?’ నాకన్నీ తెలుసు!! ‘అమ్మాయితో మాట్లాడకుండా తెలిసిపోద్దా సార్‌’ తెల్సిపోద్ది!! ‘అబ్బాయిని చూడకుండా ఇంటర్వ్యూ చెయ్యకుండా తెలిసిపోద్దా సార్‌?’ తెల్సిపోద్ది!! ‘మీకిష్టమయినది రాసేస్తారు.. చదివే వాళ్లు ఎంటర్‌టైన్మెంట్‌ అని చదివేస్తారు!’ చదివేస్తున్నారు!! ‘మీరు చెప్పింది కరెక్టో.. కాదో.. ఎవరికీ తెలియదు!!’ తెలియదు!! మరి ఏంటి సార్‌ తెలిసేది!?’ ప్రేమ తెలుసు!! ‘తొక్కేం కాదు సార్‌....! ఒక ప్రేమ ఎక్స్‌పీరియన్స్‌ లేదు. ప్రేమ తెలుసు అంటారేంటి సార్‌!’  అంటే క్యాన్సర్‌ డాక్టర్‌కి క్యాన్సర్‌ రాకపోతే ట్రీట్మెంట్‌ చెయ్యలేడా నీలూ? ‘భలే పాయింట్‌ పట్టారు సార్‌.. కానీ, మీరు డాక్టర్‌ కూడా కాదు కదా సార్‌? క్యాన్సర్‌ డాక్టర్లు అందరూ సూపర్‌ సక్సెస్‌ కాలేరు.. డాక్టర్‌ కానంత మాత్రాన హార్ట్‌ని తెలుసుకోలేనా? ‘ఏదో వంకర టింకర ఆన్సర్‌ ఇచ్చారు కానీ, సంధ్యకి మీకు తెలిసింది చెప్పండి సార్‌!’

సం«ధ్యా.. నీ ఫ్రెండ్‌కి నువ్వు ముందు చెబితే కృష్ణ మంచోడు అంది. నువ్వు మళ్లీ చెబితే రెండో అబ్బాయి మంచోడు అంటోంది. నువ్వు బెస్ట్‌ ఫ్రెండ్‌వి. నువ్వు చెబితేనే వినలేదు. నీ ఫ్రెండ్‌ నేను చెబితే వింటుందా? చెప్పు?? ‘ఏంటి సార్‌ కన్ఫ్యూజ్‌ చేస్తున్నారు? మీరు చెబుతారనే కదా మీకు రాసింది??’ కదా.. మరి నువ్వెందుకు డౌట్లు పెడుతున్నావ్‌? ‘తప్పయిపోయింది సార్‌.. చేతులెత్తి దండం పెడతా.. రెండు అరటిపండ్లు ఇస్తా..’ అలా రా దారికి. ఇప్పుడు చెబుతా చూడు.. సంధ్యా.. డోంట్‌ వర్రీ. అబ్బాయి పేరెంట్స్‌ని కలిపించాడు అంటే గుడ్‌ అబ్బాయే. రూట్‌ రాంగ్‌ కాదు. లవ్‌ రాంగ్‌ కాదు. జాగ్రత్త తీసుకోకపోవడమే రాంగ్‌. బీ కేర్‌ ఫుల్‌!! - ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement