నన్నడగొద్దు ప్లీజ్‌

Love doctor Priyadarshini Ram - Sakshi

హాయ్‌ అన్నా..! నా వయసు 22. నేను ఎనిమిది నెలలుగా రిలేషన్‌లో ఉన్నా. అంతకుముందు పద్దెనిమిది నెలలు వేరే అమ్మాయితో రిలేషన్‌ ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల విడిపోయాం. ఆ విషయం మొత్తం ప్రజెంట్‌ అమ్మాయికి చెప్పాను. అసలు సమస్య ఏంటంటే.. తను నా విషయంలో పొసెసివ్‌గా ఫీల్‌ అవుతోంది. రీసెంట్‌గా ఏదో పని ఉందంటూ నా ఫోన్‌ తీసుకుంది. అదే సమయానికి... గతంలో నాకు ట్రైన్‌లో పరిచయమైన మరో అమ్మాయి మెసేజ్‌ చేసింది. అప్పటి నుంచి ప్రతి చిన్న విషయానికీ నెగిటివ్‌గా ఆలోచించి అనుమానిస్తోంది. ప్రతిరోజూ గొడవ పెట్టుకుంటోంది. అనుమానించడానికి కూడా ఓ లిమిట్‌ ఉంటుంది కదా అన్నా? రెండోసారి ప్రేమించి నేనూ తప్పు చేశా. కానీ తన కోపాన్ని మాత్రం భరించలేకపోతున్నా. అలా అని అవాయిడ్‌ చెయ్యలేకపోతున్నా. ఏం చెయ్యాలో సలహా ఇవ్వండి ప్లీజ్‌. – నవీన్‌

ఇరవైఆరు నెలల్లో ఇద్దరితో విసిగిపోయావు. ఆల్రెడీ వేరే అమ్మాయిల ఫోన్‌ నంబర్లు సంపాదించావు. చాట్లు, పాట్లు పడుతున్నావు..! తొందరలోనే థర్డ్‌ అమ్మాయికి గుడ్‌ న్యూస్‌... సెకెండ్‌ అమ్మాయికి బ్యాడ్‌ న్యూస్‌... చెప్పడానికి అన్నీ రెడీ చేసుకున్నావు...! అమ్మాయిది పిచ్చి ప్రేమ కాబట్టి.. నీ ఆటలు సాగుతున్నాయి. ‘పిచ్చి ప్రేమ అంటే ఏంటి సార్‌?’ చెబుతున్నాడుగా అమ్మాయి చాలా పొసెసివ్‌ అని.

‘పొసెసివ్‌ అంటే పిచ్చి ప్రేమా సార్‌?’ అని నవీన్‌ అంటున్నాడు...! ఎక్కడ ఇంకో అమ్మాయితో లేచిపోతాడోనని అమ్మాయి మాటిమాటికీ నిఘా పెట్టి అన్ని విషయాలు అడుగుతోందని.. తన ఫ్రీడమ్‌ అంతా మింగేస్తోందని.. కట్టేసినట్లు అనిపిస్తోందని.. అంతా అనుమానమే కానీ, ప్రేమ కాదని నవీన్‌ ఫీల్‌ అవుతున్నాడు. ‘అనుమానమే అంటారా సార్‌?’ కలిసిన అమ్మాయిలందరితో కనెక్షన్‌ పెట్టుకోవడానికి మనోడు పడుతున్న కష్టం చూస్తుంటే అనుమానమెందుకు..?

క్యారెక్టర్‌ లూజ్‌ అని అమ్మాయికి ఇప్పటికల్లా కన్ఫర్మ్‌ అయ్యి బ్రేకప్‌ చెయ్యాల్సింది..!! ‘కానీ మంచి అమ్మాయి కాబట్టి... లవ్‌ అంటే రెస్పెక్ట్‌ ఉంది కాబట్టి... రిలేషన్‌షిప్‌కి వాల్యూ ఇస్తుంది కాబట్టి.. ఇంకా ఛీ కొట్టలేదంటారు! అంతేనా సార్‌?’ నవీన్‌.. తన క్యారెక్టర్‌ మంచిదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే నవీన్‌ది లవ్‌ అవుతుంది. లేకపోతే లైఫ్‌లో... ‘ఎప్పుడూ ఎవరి లవ్‌ దొరకదు కదా సార్‌!’ సూపర్‌ నీలూ!!

- ప్రియదర్శిని రామ్‌ ,లవ్‌ డాక్టర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top