జిగ్‌సా పజిల్ | Jigsaw puzzles | Sakshi
Sakshi News home page

జిగ్‌సా పజిల్

Feb 14 2015 11:14 PM | Updated on Sep 2 2017 9:19 PM

జిగ్‌సా పజిల్

జిగ్‌సా పజిల్

పాత పుస్తకం నుండి కొన్ని అందమైన చిత్రాలను కత్తిరించి పక్కన పెట్టుకోండి.

తయారు చేసి చూడండి
 
 కావలసినవి

అందమైన చిత్రాలు, రబ్బరు సిమెంట్ లేదా జిగురు, సన్నటి అట్ట ముక్క, కత్తెర
 
తయూరు చేసే పద్ధతి

పాత పుస్తకం నుండి కొన్ని అందమైన చిత్రాలను కత్తిరించి పక్కన పెట్టుకోండి. అట్టముక్కను మీకు నచ్చిన చిత్రానికి సరిపోయేలా అన్ని వైపులా కత్తిరించుకోండి. చిత్రం వెనుక వైపు రబ్బరు సిమెంట్, లేదా జిగురు అతికించండి. ఇప్పుడు చిత్రాన్ని అట్టముక్క పైన చక్కగా అతికించండి. జిగురు పూర్తిగా ఆరిన తరువాత అట్టముక్క వెనుక వైపు బొమ్మలో చూపించిన విధంగా వేరు వేరు ఆకారాల్లో గీతలు గీయండి. ఆ గీతల పైనే కత్తిరించి చిత్రాన్ని అనేక ముక్కలు చేయండి. ఈ ముక్కలను మళ్ళీ జాగ్రత్తగా అమర్చితే మీ జిగ్‌సా పజిల్ రెడీ! ప్రయత్నించండి మరి!

Advertisement
 
Advertisement
Advertisement