ఎక్కడిదక్కడ మరిచిపోవడమే ఆరోగ్యానికి మేలు! | It is good for you to forget wherever you go! | Sakshi
Sakshi News home page

ఎక్కడిదక్కడ మరిచిపోవడమే ఆరోగ్యానికి మేలు!

Apr 17 2018 12:32 AM | Updated on Apr 17 2018 12:32 AM

It is good for you to forget wherever you go! - Sakshi

మనల్ని ఇబ్బందిపెట్టే అంశాలు, చెడు అనుభవాలు మనసులో ఉంటే కుదురుగా ఉండలేము సరికదా.. ఆరోగ్యమూ పాడవుతుంది. అందుకే యోగ సాధనలో గురువులు తరచూ ‘మీలోని నెగెటివ్‌ ఫీలింగ్స్‌ను మరచిపోండి.. వాటిని వదిలేయండి’ అని చెబుతూంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రకంగా నెగెటివ్‌ ఫీలింగ్స్‌ను మరచిపోవడమన్నది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. దాదాపు వెయ్యిమంది మధ్య వయస్కులపై జార్జ్‌ మేసన్‌ యూనివర్సిటీ సెంటర్‌ శాస్త్రవేత్తలు ఈ అంశంపై ఒక అధ్యయనం చేశారు. రోజువారీ ఒత్తిళ్లను, నెగెటివ్‌ ఫీలింగ్స్‌ను అధిగమించలేని వారు పదేళ్ల తరువాత కూడా తీవ్రమైన భౌతిక సమస్యలకు గురవుతారని ఈ అధ్యయనం ద్వారా తెలిసింది.

ఒత్తిళ్లకు సంబంధించిన అంశాలను గుర్తుపెట్టుకోవడం ద్వారా కొంతకాలానికి వాటి ప్రభావం మన శరీరాలపై పడుతుందని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త జేమ్స్‌ మాడాక్స్‌ తెలిపారు. రోజూ ఏ రకమైన పనులు చేస్తున్నారు? అందులో ఒత్తిడికి గురి చేసే అంశాలేవి? వాటికి మీరెలా స్పందిస్తారు? ఎంతకాలం ఆ భావనలతో గడుపుతారు? వంటి అనేక అంశాలపై సమాధానాలు రాబట్టడం ద్వారా తాము ఈ అధ్యయనం చేశామని పదేళ్ల తరువాత వారి ఆరోగ్యాన్ని పరిశీలించడం ద్వారా మానసిక ఒత్తిడి, నెగెటివ్‌ ఫీలింగ్స్‌ తాలూకు ప్రభావాన్ని అంచనా వేశామని జేమ్స్‌ వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement