breaking news
physical stress
-
షోల్డర్ జాయింట్ గాయాలు... ఇలా చేస్తే నొప్పి మాయం
-
గూబ గుయ్యిమంటోంది!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ పట్టణం ఇప్పుడు ప్రపంచ పటంపై ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఎందుకో తెలుసా? అక్కడ పరిమితికి మించి రెండు రెట్లు అధికంగా శబ్ద కాలుష్యం ఉన్నట్లు తేలింది! ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన శబ్ద తీవ్రత కేవలం 55 డెసిబుల్స్(డీబీ) కాగా మొరాదాబాద్‌లో ఇది ఏకంగా 114 ఉంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా 119 డెసిబుల్స్‌తో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. మొరాదాబాద్ రెండో స్థానంలో నిలిచింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ మూడో స్థానంలో ఉంది. ఢిల్లీలో 83 డీబీ, కోల్‌కతాలో 89 డీబీ శబ్దం కాలుష్యం ఉన్నట్లు ఐరాస పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో శబ్ద కాలుష్యం తీవ్రతను వెల్లడిస్తూ తాజాగా ఐరాస ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్స్ నివేదికను విడుదల చేశారు. న్యూయార్క్, బ్యాంకాక్ హాంకాంగ్ వంటి నగరాలు జాబితాలో ఉన్నాయి. భౌతిక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం శబ్ద కాలుష్యం బెడద దక్షిణాసియాలోనే అధికంగా ఉంది. బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్‌లో పరిమితికి మించి నమోదవుతోంది. డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం శబ్ద తీవ్రత నివాస ప్రాంతాల్లో 55 డీబీ, వాణిజ్య ప్రాంతాల్లో 70 డీబీ దాకా ఉండొచ్చు. అంతకు మించిన శబ్దాన్ని ఎక్కువ సేపు వింటే వినికిడి శక్తి పోయే ప్రమాదముంది. శబ్ద కాలుష్యం మనుషుల భౌతిక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. న్యూయార్క్‌లో ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించే వారిలో ప్రతి 10 మందిలో 9 మంది శబ్ద కాలుష్యానికి గురవుతున్నారని నివేదిక వెల్లడించింది. ‘‘హాంకాంగ్‌లో ప్రతి ఐదుగురిలో ఇద్దరిది ఇదే పరిస్థితి. యూరప్‌లో అతిపెద్ద నగరాల పౌరుల్లో సగం మంది శబ్ద కాలుష్య బాధితులే’’ అని స్పష్టం చేసింది. ట్రాఫిక్ రణగొణ ధ్వనుల కారణంగా కొన్ని సిటీల్లో పక్షులు తమ కూత సమయాన్ని కూడా మార్చుకుంటున్నట్లు నిపుణులు గుర్తించారు. -
ఎక్కడిదక్కడ మరిచిపోవడమే ఆరోగ్యానికి మేలు!
మనల్ని ఇబ్బందిపెట్టే అంశాలు, చెడు అనుభవాలు మనసులో ఉంటే కుదురుగా ఉండలేము సరికదా.. ఆరోగ్యమూ పాడవుతుంది. అందుకే యోగ సాధనలో గురువులు తరచూ ‘మీలోని నెగెటివ్ ఫీలింగ్స్‌ను మరచిపోండి.. వాటిని వదిలేయండి’ అని చెబుతూంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రకంగా నెగెటివ్ ఫీలింగ్స్‌ను మరచిపోవడమన్నది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. దాదాపు వెయ్యిమంది మధ్య వయస్కులపై జార్జ్ మేసన్ యూనివర్సిటీ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ అంశంపై ఒక అధ్యయనం చేశారు. రోజువారీ ఒత్తిళ్లను, నెగెటివ్ ఫీలింగ్స్‌ను అధిగమించలేని వారు పదేళ్ల తరువాత కూడా తీవ్రమైన భౌతిక సమస్యలకు గురవుతారని ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ఒత్తిళ్లకు సంబంధించిన అంశాలను గుర్తుపెట్టుకోవడం ద్వారా కొంతకాలానికి వాటి ప్రభావం మన శరీరాలపై పడుతుందని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త జేమ్స్ మాడాక్స్ తెలిపారు. రోజూ ఏ రకమైన పనులు చేస్తున్నారు? అందులో ఒత్తిడికి గురి చేసే అంశాలేవి? వాటికి మీరెలా స్పందిస్తారు? ఎంతకాలం ఆ భావనలతో గడుపుతారు? వంటి అనేక అంశాలపై సమాధానాలు రాబట్టడం ద్వారా తాము ఈ అధ్యయనం చేశామని పదేళ్ల తరువాత వారి ఆరోగ్యాన్ని పరిశీలించడం ద్వారా మానసిక ఒత్తిడి, నెగెటివ్ ఫీలింగ్స్ తాలూకు ప్రభావాన్ని అంచనా వేశామని జేమ్స్ వివరించారు. -
మానసిక సమస్యల వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్ రావచ్చు
థైరాయిడ్ గ్రంథిలో కొన్నిరకాల కారణాల వల్ల హైపో మరియు హైపర్ థైరాయిడిజమ్ వంటివి రావచ్చు. అంటే వారసత్వంగా కాని, ఏదైనా మానసిక ఒత్తిడి, ఆందోళనల వల్ల, థైరాయిడ్ గ్రంథిలో ఉండే హార్మోన్లు ఉత్పత్తి సరిగ్గా ఉండదు. అంటే T3, T4 హార్మోన్లు ఎక్కువ లేదా తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతాయి. ఒక్కొక్కసారి థైరాయిడ్ గ్రంథిలో చిన్నచిన్న కాయలలాంటివి ఏర్పడి, అవి క్యాన్సర్ స్థాయికి కూడా రావచ్చు. ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథిలో వచ్చిన లోపాల వల్ల, మానసిక మరియు శారీరక ఎదుగుదల మరియు సమస్యలు, అవయవాల యొక్క పనితీరు దెబ్బ తింటుంది. థైరాయిడ్ గ్రంథి అనేది శరీరంలో అతి పెద్దది. ఇది ముఖ్యంగా మెడ భాగంలో, థైరాయిడ్ కార్టిలేజ్ కింద ఉంటుంది. జీవప్రక్రియలు అన్నింటికీ ఇది అతి ముఖ్యమైన గ్రంథి. శరీరంలో ఉండే అతి ముఖ్యమైన అవయవాలను కూడా థైరాయిడ్ గ్రంథి కంట్రోల్లో ఉంచుతుంది. థైరాయిడ్ గ్రంథి ముఖ్యంగా 3 రకాలైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. 1. థైరాక్సిన్ (T3), 2) ట్రైబడో థైరోనిన్ (T4), 3) కాల్సిటోనిన్. ఈ కాల్సిటోనిన్ శరీరంలో సరైన మొత్తంలో క్యాల్షియమ్‌ను ఉత్పత్తి అయ్యేలా చూస్తుంది. హైపర్ థైరాయిడిజమ్ లక్షణాలు 1. కంగారు పడటం 2. చిరాకు 3. చెమట ఎక్కువ పట్టడం 4. గుండె దడ 5. చేతులు వణకడం 6. ఆందోళన 7. నిద్రలేమి 8. చర్మం పొడిబారడం 9.జుట్టు రాలడం 10. విరేచనాలు 11.బరువు తగ్గిపోవడం 12.వేడిని తట్టుకోలేకపోవటం 13. ఆకలి పెరగడం 14. యూరిన్ ఎక్కువసార్లు అవ్వటం 15. నెలసరులు సరిగ్గా రాకపోవటం 16. కంటి చుట్టూ ఉండే కండరాలు బలహీనపడటం. హైపో థైరాయిడిజమ్ లక్షణాలు: ఇక్కడ థైరాయిడ్ హార్మోన్లు తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతాయి. ఆడవాళ్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అతి బరువు, నెలసరి సమస్యల వల్ల చాలా త్వరితంగా పరిస్థితిని గుర్తించవచ్చు. లక్షణాలు: 1. అలసట; 2. ఆయాసం, మానసికంగా ఆత్మనూన్యతకు లోనవటం; 3. చలిని తట్టుకోలేకపోవటం; 4.మలబద్దకం; 5. జుట్టు, చర్మం పొడిబారటం; 6. ఏకాగ్రత తగ్గిపోవటం; 7. శరీరం అంతా నొప్పులు; 8. కాళ్లు వాచటం; 9. కంటి చుట్టూ వాపులు రావటం; 10. నెలసరులు సరిగ్గా రాకపోవటం అంటే అధిక రక్తస్రావం లేదా నెలసరులు పూర్తిగా రాకపోవటం; 11. బరువు అకారణంగా పెరగటం. పైన చెప్పిన ఈ లక్షణాలన్నీ థైరాయిడ్ గ్రంథిలో వచ్చే అసమతుల్యత వల్ల, శరీరంలో ప్రతి ప్రక్రియ కూడా భాగం అవటం వల్ల, ప్రతి అవయవంలో కూడా విభేదం వస్తుంది. అంతేకాకుండా ఆడవాళ్లలో నెలసరుల సమస్యలతో పాటు ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథిలో వచ్చిన లోపం వల్ల, మానసిక ఎదుగుదల, మానసిక లోపాలు కూడా ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా హైపర్ థైరాయిడిజమ్ వల్ల వచ్చే మానసిక సమస్యలు: ఎక్కువగా మానసిక ఒత్తిడి, ఆందోళనల వల్ల హైపర్ థైరాయిడిజమ్ రావచ్చు. 1. ఎక్కువగా ఆందోళన పడటం; 3. ప్రతి చిన్న విషయానికి భయపడటం; 3. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా రియాక్ట్ అవుతుండటం; 4. శబ్దాలను భరించలేకపోవటం; 5. ఆత్మన్యూనతకు లోనవుతుండటం. ఈ థైరాయిడ్ గ్రంథి వల్ల వచ్చే మానసిక సమస్యలను చికిత్స లేకుండా విడిచిపెట్టేస్తే ‘థైరాయిడ్ క్రైసిస్’ లాంటివి రావచ్చు. అంటే మానసిక లక్షణాలు ఇంకా ఎక్కువ రావటం, జ్వరం లేదా తనలో తాను అదేపనిగా మాట్లాడుకోవటం వంటివి కనిపిస్తూంటాయి. హైపో థైరాయిడిజమ్ వల్ల వచ్చే మానసిక సమస్యలు: 1. మానసిక ఎదుగుదలలో లోపాలు; 2. ఆసక్తి తగ్గిపోవటం; 3. విషయాలు సరిగ్గా గుర్తుండక, జ్ఞాపకశక్తి తగ్గిపోవటం; 4. ఆలోచనా శక్తి కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఆత్మన్యూనత హైపోథైరాయిడిజమ్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే శారీరకంగా కూడా అధిక బరువు వల్ల అందరిలాగా ప్రతి పనిలో పాల్గొనలేకపోవటం, ఏకాగ్రత, ఆలోచనా శక్తి తగ్గిపోవటం వల్ల, చదువులో వెనకబడతారు. దీనివల్ల నలుగురిలో కలవలేక వెనకబడతారు. ఏది ఏమైనా హైపో మరియు హైపర్ థైరాయిడిజమ్ వల్ల మానసికంగా పేషెంట్లు ఎక్కువగా బాధపడటం వల్ల, థైరాయిడ్ లెవెల్స్ మరీ ఎక్కువ లేదా తక్కువ అవటం జరుగుతుంది. కాబట్టి పాజిటివ్ హోమియోపతిలో ఈ మానసిక సమస్యలకు అనుగుణంగా, పేషెంట్ తత్త్వాన్ని బట్టి, మూలకారణాన్ని ఎనలైజ్ చేసుకుని ‘జెనిటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్’ అనే పద్ధతి ద్వారా మందులు ఇచ్చి పూర్తిస్థాయిలో పరిష్కారం చూపుతారు.