మీ టీవీ ని ఎలా శుభ్రం చేస్తున్నారు? | home tips for cleaning and electronics | Sakshi
Sakshi News home page

మీ టీవీ ని ఎలా శుభ్రం చేస్తున్నారు?

Mar 29 2016 11:58 PM | Updated on Oct 22 2018 8:11 PM

మీ టీవీ ని ఎలా శుభ్రం చేస్తున్నారు? - Sakshi

మీ టీవీ ని ఎలా శుభ్రం చేస్తున్నారు?

ముందు మానిటర్‌ని ఆఫ్ చేయండి. దీంతో మురికి ఎక్కడ ఉందో కనిపిస్తుంది.

ముందు మానిటర్‌ని ఆఫ్ చేయండి. దీంతో మురికి ఎక్కడ ఉందో కనిపిస్తుంది.

పొడిగా ఉండే మెత్తటి క్లాత్‌ను (కళ్లద్దాలను తుడిచేలాంటి క్లాత్) తీసుకొని, ముందు దుమ్ము పోయేలా తుడవండి. ఎక్కువ ఒత్తిడి లేకుండా పై నుంచి కిందకు తుడవాలి.

వెనిగర్, నీళ్లు సమభాగాలు తీసుకొని దీంట్లో మెత్తటి క్లాత్ ముంచి, పిండి దాంతో స్క్రీన్‌ను తుడవాలి. ఆ తర్వాత పొడి క్లాత్‌తో తుడవాలి.

పేపర్ టవల్స్, టాయిలెట్ పేపర్స్, షర్ట్ క్లాత్స్‌ను స్క్రీన్ తుడవడానికి ఉపయోగించకూడదు.

అమ్మోనియా, ఇథైల్ ఆల్కహాల్, ఎసిటోన్ వంటి రసాయనాలతో స్క్రీన్ తుడిస్తే త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.

లిక్విడ్స్ ఏ మాత్రం డెరైక్ట్‌గా స్క్రీన్ మీద స్ప్రే చేయకూడదు. స్ప్రే మానిటర్ లోపలికి వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీంతో త్వరగా స్క్రీన్ పాడవ్వచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement