అది సన్నీ పని కాదట! | Gossip | Sakshi
Sakshi News home page

అది సన్నీ పని కాదట!

May 15 2015 11:11 PM | Updated on Sep 18 2018 8:00 PM

అది సన్నీ పని కాదట! - Sakshi

అది సన్నీ పని కాదట!

పోర్న్ స్టార్ ముద్రను వదిలించుకుందామని ఎంత ప్రయత్నిస్తున్నా వీలు కావడం లేదు అంటూ వాపోతోంది సన్నీ లియోని.

గాసిప్
 
పోర్న్ స్టార్ ముద్రను వదిలించుకుందామని ఎంత ప్రయత్నిస్తున్నా వీలు కావడం లేదు అంటూ వాపోతోంది సన్నీ లియోని. ఎక్కడ్నుంచో చుట్టపు చూపుగా వచ్చిన సన్నీ... మొదట బాలీవుడ్‌లో పాగా వేసింది. తర్వాత తమిళ, తెలుగు సీమల్లోనూ కాలు మోపింది. నేను గతాన్ని సమాధి చేసేశాను, ఈ దేశంలో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాను అంటూ ఇంటర్వ్యూల్లో గుక్క తిప్పుకోకుండా చెప్పింది.

కానీ ఫలితం లేకుండా పోయింది. ‘నెట్‌లో ఎక్కడ చూసినా సన్నీ అసభ్యకర చిత్రాలు, పోస్టింగులే కనిపిస్తున్నాయి’ అంటూ అంజలీ పాలన్ అనే ఓ గృహిణి తాజాగా కేసు వేసింది. దాంతో ఖంగుతిన్న సన్నీ... అవి నేను పోస్ట్ చేసినవి కాదు, ఎవరో నా పేరు మీద చేస్తున్నారు అంటూ సంజాయిషీలు ఇచ్చుకుంటోంది. మరి ఆమె మాటల్ని పోలీసులు, కోర్టు నమ్ముతాయో లేదో చూడాలి!
 
 

Advertisement
 
Advertisement
Advertisement