కర్బూజ చలువ... చవక | Good food in summer | Sakshi
Sakshi News home page

కర్బూజ చలువ... చవక

Apr 2 2018 1:14 AM | Updated on Apr 2 2018 1:14 AM

Good food in summer  - Sakshi

కర్బూజ వేసవిలో విరివిగా దొరుకుతుంది. ఒకింత చవకగానూ లభిస్తుంది. దోసజాతికి చెందిన ఈ పండును ఈ సీజన్‌లో తింటే చలవచేస్తుంది కాబట్టి చాలామంది దీన్ని తీసుకుంటూ ఉంటారు. సహజంగా అంతగా తియ్యగా ఉండదు కాబట్టి ఏ చక్కెరతోనో లేదా ఏ జ్యూస్‌ రూపంలోనో తీసుకుంటారు. కానీ స్వాభావికంగా తిన్నా లేదా కొద్ది పాటి చక్కెరతో తింటేనే ఎంతో మేలు. దీనితో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. వాటిలో కొన్ని ఇవి...
కర్బూజలో నీటిపాళ్లతో పాటు ఖనిజలవణాలూ ఎక్కువ. అందుకే వేసవిలో తీసుకుంటే డీ–హైడ్రేషన్‌ ప్రమాదం నుంచి కాపాడుతుంది.
దీనిలో పీచుపదార్థాలూ చాలా ఎక్కువ. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంతో పాటు పేగులనూ ఆరోగ్యంగా ఉంచుతుంది.
దీనిలో పీచు ఎక్కువ, తీపి తక్కువ. అందుకే డయాబెటిస్‌ రోగులకు చాల మేలు చేస్తుంది. దీని పీచు మలబద్దకాన్ని నివారిస్తుంది.
ఆకలి లేమితో బాధపడేవారికి కర్బూజ ఒక స్వాభావికమైన ఔషధంగా పనిచేసి, ఆకలిని పుట్టిస్తుంది.
అసిడిటీని అరికడుతుంది. అల్సర్‌ వంటి సమస్యలను నివారిస్తుంది.
పుష్కలమైన విటమిన్‌–సి కారణంగా మంచి వ్యాధినిరోధకతను సమకూర్చి, ఎన్నెన్నో వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
ఐరన్‌ పాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత నుంచి కాపాడుతుంది.
దీనిలో క్యాల్షియం, ఫాస్ఫరస్‌ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే ఎముకలను దృఢపరచి, ఆస్టియోపోరోసిస్‌ వంటి అనేక వ్యాధులను నివారిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement