పెరిగే వయసును ఆపే పెసలు!

Good food with Green grams - Sakshi

పెసలు ఆకుపచ్చగా ఉండటంతో ఇంగ్లిష్‌లో వాటిని గ్రీన్‌గ్రామ్స్‌ అంటారు. తమ గింజ రంగుతో ఆరోగ్యానికి పచ్చసిగ్నల్‌ను చూపడంతో పాటు పెరిగే వయసుకు ఎర్రజెండా చూపిస్తాయవి. పైగా వేసవిలో పెసలు చలవచేస్తాయని అంటారు మన పెద్దలు. ఆ మాటతో పాటు...  పెసలు ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయని చాలా అధ్యయనాల్లో నిరూపితమైంది. పెసలుతో కలిగే ఆరోగ్య  ప్రయోజనాల్లో ఇవి కొన్ని...

పెసలులో చాలా రకాల విటమిన్లు, ఖనిజలవణాలు ఉంటాయి. అవి వయసు పెరగడం వల్ల వచ్చే మార్పులను చాలాకాలం పాటు కనపడనివ్వవు. చర్మాన్ని మిలమిలలాడేలా చేసి, మంచి నిగారింపు ఇస్తాయి. ఏజింగ్‌ ప్రక్రియను ఆలస్యం చేసేందుకు దోహదపడే పదార్థాలలో పెసలు చాలా ముఖ్యమైనవి.
 వయసు పెరుగుతున్నప్పుడు కనిపించే ముడుతలను పెసలులోని కాపర్‌ రాకుండా చేస్తుంది. అలాగే పెసలు కంటికింద, దగమ కింద చర్మం వేలాడటాన్ని చాలా ఆలస్యం చేస్తాయి. డబుల్‌ చిన్‌ను నివారిస్తాయి.
 హైబీపీ ఉన్నవారు పెసరపప్పు వాడటం ఎంతో మంచిది. ఇందులో పొటాషియమ్‌ ఎక్కువ. అందుకే హైబీపీని నియంత్రించేందుకు పెసలు ఉపయగపడతాయి.
 పెసలు ఒంట్లోని కొవ్వులు, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతాయి. రక్తప్రసరణను సాఫీగా అయ్యేలా చేసి గుండె ఆరోగ్యాన్ని పదికాలాలు పదిలంగా ఉంచుతాయి.
 పెసల్లో పీచు పాళ్లు చాలా ఎక్కువ. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడే ప్రోబయోటిక్‌  అంశాలూ ఎక్కువే. పెసలు మలబద్ధకాన్ని నివారించి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.  ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి అవి బాగా ఉపయోగపడతాయి.
 పెసల్లో ఐరన్‌ పాళ్లు చాలా ఎక్కువ. అనీమియాను దూరం చేసుకోడానికి పెసలు వాడకం స్వాభావికమైన వైద్యచికిత్సగా పరిగణించవచ్చు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top