Face Pack: పెసలను రాత్రంతా నానబెట్టి.. గ్రైండ్‌ చేసి.. ఇలా మర్ధనా చేస్తే!

Beauty Tips: Mung Bean Pesala Pack For Glowing Face - Sakshi

పెసలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని పొందవచ్చు. ఇంట్లోనే ఈ సులువైన చిట్కాలు పాటించి నునుపైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.
►టేబుల్‌ స్పూన్‌ పెసలను రాత్రంతా నానబెట్టి ఉదయం మెత్తగా గ్రైండ్‌ చేసి అందులో అర టీ స్పూన్‌ నెయ్యి లేదా పాలు వేసి కలిపి ముఖానికి పట్టించి మర్దన చేసి పది నిమిషాల సేపు మిశ్రమాన్ని ముఖం మీద ఉంచాలి.

►ఈ ప్యాక్‌ పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇలా చేస్తే పొడిబారిన చర్మం ఆరోగ్యంగా, నునుపుగా మారుతుంది. ఆయిల్‌ స్కిన్‌ వాళ్లయితే పెసర పేస్ట్‌లో కొద్దిగా మజ్జిగ లేదా పన్నీరు కలుపుకోవాలి. 

►ఎండకు కమిలిపోయిన చర్మం తిరిగి మామూలు కావాలంటే... పైన చెప్పుకొన్న పెసల పేస్టులో చల్లటి పెరుగు లేదా కలబంద పేస్టు కలిపి ముఖానికి, చేతులకు, పాదాలకు పట్టించి ఐదు నిమిషాల సేపు మర్దన చేయాలి. ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి.

హెయిర్‌ ఫాల్‌ తగ్గాలంటే...
రాత్రంతా నానబెట్టిన పెసలను గ్రైండ్‌ చేసి అందులో కోడిగుడ్డు సొన, టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం, కప్పు పెరుగు కలిపి చిక్కటి పేస్టు చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి 15నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఈ మూంగ్‌దాల్‌ ప్యాక్‌ను నూనె రాసిన జుట్టుకు పట్టించకూడదు. షాంపూతో తలస్నానం చేసి ఆరిన తర్వాత మాత్రమే వేయాలి. 

చదవండి: Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే..
Nora Fatehi: భోజనంలో అవి ఉండాల్సిందే! రోజూ ఆయిల్‌ మసాజ్‌.. నా బ్యూటీ సీక్రెట్‌ ఇదే!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top